యువ కథానాయకుడు నితిన్ చివరగా గత ఏడాది ఫిబ్రవరిలో ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా అన్ సీజన్లోనూ మంచి వసూళ్లు సాధించి నితిన్ ఖాతాలో ఓ హిట్ జమ చేసింది. వరుస ఫ్లాపుల తర్వాత అతడికి ఉపశమనాన్నిచ్చిన చిత్రమిది. సమ్మర్ లాంటి సీజన్లో ఈ సినిమా వచ్చుంటే పెద్ద విజయమే సాధించేదేమో. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు నితిన్ తన కొత్త చిత్రం ‘చెక్’ను కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయించాడు.
విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు విడుదల ముందుగా మరీ హైప్ ఏమీ లేదు. యేలేటి గత సినిమాల ప్రభావం దీని మీద ఉండటం వల్లో ఏమో అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో జరగలేదు. ఐతే తొలి రోజు ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి. నితిన్ క్రేజ్ దీనికి కలిసొచ్చి ఆరంభ వసూళ్లు ఓకే అనిపించాయి.
తొలి రోజు ‘చెక్’ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.3.4 కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం. ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఈ వసూళ్లు ఎంతో మెరుగనే చెప్పాలి. నితిన్‌కు మంచి మార్కెట్ ఉన్న నైజాంలో ‘చెక్’ కోటిన్నర దాకా షేర్ రాబట్టడం విశేషం. సీడెడ్‌లో అరకోటి మేర షేర్ వచ్చింది. ఆంధ్రాలో మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.1.4 కోట్ల దాకా షేర్ రాబట్టింది ‘చెక్’. ఓవర్సీస్‌లో ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజైంది. అక్కడ కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా తొలి రోజు వరల్డ్ వైడ్ షేర్ రూ.4 కోట్లకు చేరువగా ఉండొచ్చు.
ఐతే తెలుగు రాష్ట్రాల వరకే ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను రూ..15.5 కోట్లకు అమ్మారు. అంటే ఈ సినిమా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. తొలి రోజు లాగే శని, ఆదివారాల్లోనూ వసూళ్లు వస్తే సినిమా సేఫ్ జోన్ వైపు అడుగులు వేయొచ్చు. కానీ టాక్ డివైడ్‌గా ఉన్న నేపథ్యంలో వీకెండ్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు ఉంటాయా అన్నది సందేహం.
This post was last modified on February 27, 2021 1:58 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…