మూణ్నాళుగేళ్ల ముందు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నంబర్ వన్ హీరోయిన్. సమంత, కాజల్, తమన్నా, అనుష్క లాంటి టాప్ స్టార్ల జోరు తగ్గిపోయిన సమయంలో ఆమె వరుస హిట్లతో దూసుకెళ్లింది. పెద్ద పెద్ద హీరోలతో వరుసగా భారీ చిత్రాలు చేసింది. ఇక ఆమెకు తిరుగులేదని, తనను కొట్టేవాళ్లు లేరని అంతా అనుకుంటే.. ఉన్నట్లుండి తన కెరీర్ డౌన్ అయిపోయింది. వరుస ఫ్లాపులతో రకుల్ వెనుకబడిపోయింది. అవకాశాలు తగ్గిపోయాయి. చూస్తుండగానే తెలుగు సినిమాల నుంచి కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. చివరగా తెలుగులో రకుల్ నటించిన ‘మన్మథుడు-2’ కూడా పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె టాలీవుడ్లో కనిపించలేదు.
ఐతే చాలా విరామం తర్వాత ఆమె నటించిన ‘చెక్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇందులో రకుల్ ముఖ్య పాత్రే పోషించినట్లు కనిపిస్తోంది. ఐతే గ్యాప్ తర్వాత తెలుగులో తాను నటించిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజవుతుంటే.. రకుల్ ప్రమోషన్లలో ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ముందు ‘చెక్’ టీం ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అందులో రకుల్ కనిపించలేదు. దానికి సినిమాలో మరో కథానాయికగా నటిస్తున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం హాజరైంది. రకుల్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా రకుల్ దర్శనమివ్వలేదు. ఆ వేడుకలోనూ ప్రియనే హైలైట్ అయింది. ప్రియ తర్వాత మీడియా వాళ్లనూ స్పెషల్‌గా మీట్ అయింది. కానీ రకుల్ ఇప్పుడు కూడా కనిపించడం లేదు. ట్విట్టర్లో కూడా ఏదో మొక్కుబడిగా సినిమాకు సంబంధించి ఒకటీ అరా ట్వీట్లు వేస్తోంది తప్ప ఈ సినిమాను రకుల్ ఓన్ చేసుకున్నట్లుగా కనిపించడం లేదు.
అసలే టాలీవుడ్లో కెరీర్ డల్ అయిన టైంలో తాను నటించిన ఓ పేరున్న సినిమా రిలీజవుతుంటే రకుల్ ఎందుకు పట్టించుకోవట్లేదన్నది అర్థం కాని విషయం. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఒక్క రోజు కూడా కేటాయించనంత బిజీగా రకుల్ ఉందా అన్నది సందేహం. ఐతే సినిమాలో తన పాత్ర కంటే ప్రియ క్యారెక్టర్‌ను పెంచడం, ఆమెకు ఒక పాట కూడా పెట్టడం పట్ల ఆమె హర్ట్ అయిందని, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఇంకేవో మనస్ఫర్థలు వచ్చాయని, ఈ నేపథ్యంలోనే ఆమె ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 25, 2021 12:55 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…