థియేటర్లు తెరుచుకుని 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నప్పటికీ ముందే కుదిరిన ఒప్పందాల మేరకు కొన్ని చిత్రాలను ఇప్పటికీ నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసే సంస్కృతి ఆగిపోలేదు. తమిళంలో ఇప్పటికే ధనుష్ సినిమా ‘జగమే తంత్రం’ను నెట్ ఫ్లిక్స్‌కు ఇచ్చేయడం, త్వరలోనే ప్రిమియర్స్‌కు సన్నాహాలు చేస్తుండటం తెలిసిందే. అది ఒకేసారి తెలుగులోనూ విడుదలవుతుంది. దీంతో పాటు మరో పేరున్న తమిళ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఆ సినిమానే.. టెడ్డి.
తమిళ స్టార్ హీరో ఆర్య ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో.. అతడి భార్య, తెలుగులో ‘అఖిల్’ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన సాయేషా హీరోయిన్ రోల్ చేసింది. జయం రవి హీరోగా నటించిన ‘టిక్ టిక్ టిక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న శక్తి సౌందర్ రాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇదొక ప్రయోగాత్మక కథతో తెరకెక్కింది.
దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు తెలిసిన ఓ వ్యక్తి ప్రమాదం కారణంగా కోమాలోకి వెళ్లిపోగా.. ‘ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్’ అనే పద్ధతి ద్వారా ఆ వ్యక్తి ఆత్మ ఓ టెడ్డీబేర్‌లోకి రావడం.. దాన్ని మట్టుపెట్టేందుకు విలన్లు ప్రయత్నించడగా.. దాన్ని హీరో కాపాడుతూ విలన్లతో పోరాటం చేయడం.. ఈ నేపథ్యంలో నడిచే సినిమా ‘టెడ్డి’.
టెడ్డీ బేర్ విన్యాసాలు కొంచెం కొత్తగా, ఆసక్తికరంగా అనిపిస్తుంటే.. ఆర్య పూర్తి స్థాయి యాక్షన్ అవతారంలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అతడి లుక్, ఇంటెన్స్ యాక్టింగ్ బాగున్నాయి. సైన్స్‌తో ముడిపడ్డ సన్నివేశాలు ట్రైలర్లో ఆసక్తి రేకెత్తించాయి. సినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అనిపిస్తోంది. సాయేషా అందంగా కనిపించింది. ఈ చిత్రాన్ని సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. హాట్ స్టార్ వాళ్లతో ఎప్పుడో డీల్ అయిపోయింది. మార్చి 12న ఈ సినిమాకు ప్రిమియర్స్ పడబోతున్నాయి. తెలుగులోనూ ట్రైలర్ రిలీజ్ చేసిన నేపథ్యంలో మన భాషలోనూ సినిమా చూసుకోవచ్చు.
This post was last modified on February 24, 2021 4:47 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…