రోజురోజుకీ విస్తరిస్తున్న సోషల్ మీడియా కారణంగా జనాలకు విపరీతమైన స్వేచ్ఛ దొరికింది. చిన్న ఛాన్స్ దొరికితే చాలు… పీఎం దగ్గర్నుంచి సినిమా హీరోల దాకా అందర్నీ ట్రోల్ చేసి చంపేస్తున్నారు. పాజిటివ్‌గా ట్వీట్ చేసినా కూడా జనాల నుంచి విపరీతమైన నెగిటివిటీకి గురవుతున్నవారి సంగతి చెప్పక్కర్లేదు. తాజాగా అలా సోషల్ మీడియా జనాలకి చిక్కి, మరోసారి ట్రోలింగుకు గురయ్యాడు అల్లు శిరీష్.
మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా మిగిలినవారిలా క్రేజ్ దక్కించుకోలేకపోయాడు అల్లు శిరీష్. శిరీష్ ఎంట్రీ మూవీ ‘గౌరవం’ మూవీ నుంచి లేటెస్ట్ మూవీ ‘ఏబీసీడీ’ దాక అన్నీ డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చాయి. మధ్యలో వచ్చిన మారుతి ‘కొత్తజంట’ మాత్రమే సోసో విజయాన్ని అందించింది. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాకు నూరుశాతం కష్టపడుతున్నాడు శిరీష్. సినిమాల సెలక్షన్‌కి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. లాక్‌డౌన్‌లో ఉన్న అల్లు శిరీష్… సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నాడు. దాంతో ఓ వ్యక్తి ‘బర్త్ డే సరదాగా ఒక నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఇయ్యి అన్నా’ అంటూ శిరీష్‌కు ట్వీట్ చేశాడు. దానికి సమాధానంగా ‘తీసుకో బ్రో.. యూజర్ నేమ్: దయా… పాస్ వర్డ్: పోలీస్… ఎంజాయ్’ అంటూ జోక్ చేశాడు. టెంపర్ సినిమాలో డైలాగుతో ఆకట్టుకున్నాడు.
కాని ఈ జోక్‌ను ట్రోలింగ్‌కి వాడుకుంటున్నారు కొందరు నెటిజన్లు. ‘ఈ జోక్ కంటే నీ కెరీర్ గ్రాఫే చాలా కామెడీగా ఉంది అన్నా’ అంటూ కామెంట్ చేశాడో యువకుడు. ఇలా సరదాగా జోక్ చేయాలని చూసిన మెగా హీరోకి ట్రోల్ చేస్తూ ఓ ఆటాడేసుకున్నారు నెటిజన్లు. శిరీష్‌కు ఇలాంటి ట్రోలింగ్ కొత్తేమీకాదు. మనోడిని చాలాసార్లు, చాలా విషయాల్లో ట్రోల్ చేశారు సోషల్ మీడియా జనాలు. అయితే వాటిని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ వెళ్తున్నాడు అల్లు శిరీష్.
This post was last modified on May 8, 2020 6:45 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…