తెలుగులో అయితే రక్షిత.. తమిళంలో అయితే ఆనంది.. ఈ అమ్మాయి సినీ ప్రస్థానం చాలా చిత్రంగా సాగింది. తెలుగులో ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసిన ఈ తెలుగమ్మాయికి ఇక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తమిళంలో కయల్ అనే సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసిన ఆమెకు అక్కడ మంచి పేరొచ్చింది.
అక్కడ అందరూ ఆమెను ఆనందిగా పిలుస్తారు. ఆ పేరుతో బాగానే పాపులారిటీ సంపాదించింది. మంచి మంచి సినిమాలు చేసి కథానాయికగా మంచి స్థాయిని అందుకుంది. ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాత్రలే ఎంచుకుంటూ సినిమా సినిమాకూ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న ఆనంది.. కెరీర్లో తొలిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది. ఆ సినిమా పేరు.. కమలి ఫ్రమ్ నడుక్కవేరి. రాజశేఖర్ దురైస్వామి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఋ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ ఏడాది ఇప్పటిదాకా తమిళంలో వచ్చిన చిత్రాల్లో ఇదే ది బెస్ట్ అంటున్నారు క్రిటిక్స్. ఇందులో ఆనంది పెర్ఫామెన్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. ఆమెకిది కెరీర్ బెస్ట్ ఫిలిం అని ఘంటాపథంగా చెబుతున్నారు. ఓ క్రిటిక్ అయితే ఆనంది కెరీర్‌కు ఈ సినిమా ఒక్కటి చాలు అంటూ ట్వీట్ వేశాడు. ఇదొక ఉదాత్తమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా.
ఒక మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి ఎన్నో కష్టాలను, అడ్డంకులను అధిగమించి ఐఐటీలో చదవాలన్న తన కోరికను ఎలా నెరవేర్చుకుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ.. ఆలోచన రేకెత్తించేలా, ఎంతో హృద్యంగా ఈ సినిమా తీశారని అందరూ మెచ్చుకుంటున్నారు. రివ్యూలు బాగున్నాయి. కలెక్షన్లకూ ఢోకా లేదు. మాస్ సినిమా చక్రకు దీటుగా ఈ సినిమా నిలుస్తున్న ఈ చిత్రం ఆనందికి పెద్ద బ్రేక్ అయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on February 22, 2021 7:40 am
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…