చిరంజీవి ఎప్పుడో పుత్రోత్సాహం పొందాడు.చరణ్ ఆయన పేరును నిలబెడుతూ పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. మెగా కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరోలు కూడా ఆయనకు అమితానందాన్ని కలిగిస్తున్నారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ హీరోలుగా స్థిరపడ్డారు. ఇప్పుడు చిరు చిన్న మేనల్లుడు, సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
తన చిన్న మేనల్లుడికి హీరోగా ఇలాంటి ఆరంభం దక్కేసరికి చిరు ఆనందం మామూలుగా లేదు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనే ఆయన ఆనందం అందరికీ తెలిసిందే. సినిమా పెద్ద హిట్ కాబోతోందని ముందే ఊహించి తన ఉత్సాహాన్ని చూపించాడు. ఆయన అంచనాలకు తగ్గట్లే ఉప్పెన భారీ ఓపెనింగ్స్‌తో మొదలైంది. వసూళ్ల మోతను కొనసాగిస్తూపెద్ద రేంజికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో చిరు చిత్ర బృందానికి తన ప్రేమను పంచాడు.
ఉప్పెన విజయంలో భాగమైన అందరికీ చిరు ప్రత్యేక కానుకలు పంపాడు. సినిమా విజయంలో వారి పాత్రను ప్రస్తుతిస్తూ.. ఒక లేఖ రాయడంతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా పంపాడు. ముందుగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనకు దక్కిన అపురూపమైన కానుకను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఉప్పెన సినిమాలో హైలైట్‌గా నిలిచిన జలజలపాతం పాటను గుర్తు తెచ్చేలా ఉన్న ఆ కానుకను చూపిస్తూ.. చిరుకు కృతజ్ఞతలు చెబుతూ ఒక వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. అలాగే తనకు చిరు పంపిన అభినందన లేఖను కూడా షేర్ చేశాడు.
మరోవైపు హీరోయిన్ కృతి శెట్టి సైతం చిరు తనను ప్రశంసిస్తూ రాసిన లేఖను షేర్ చేసింది. చిత్ర బృందంలో మిగతా వారికి సైతం చిరు ఇలాగే కానుకలు పంపినట్లు తెలుస్తోంది. తన మేనల్లుడి సినిమా విజయానికి చిరు ఎంత పొంగిపోతున్నారో చెప్పడానికిది నిదర్శనం. తన కుటుంబ సభ్యుల పట్ల చిరుకుండే ప్రేమ గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.
This post was last modified on February 22, 2021 7:34 am
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…