అగ్ర దర్శకుడు సుకుమార్ ఫేస్ బుక్‌లో పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. అది తన మిత్రుడు ప్రసాద్ పుట్టిన రోజును పురస్కరించుకుని పెట్టిన పోస్టు. ప్రసాద్ నెల కిందటే హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. సుకుమార్ దర్శకుడిగా మారిన రోజుల నుంచి ప్రసాద్ ఆయనకు అండగా ఉంటున్నాడు. కాలేజీ రోజుల నుంచి సుక్కుకు ఆయన పరిచయం.
తాను సినిమాల్లో నిలదొక్కుకున్నాక ప్రసాద్‌ను ఇక్కడికి పిలిపించుకున్నాడు. సుక్కు వ్యక్తిగత, ఆర్థిక, సినిమా సంబంధిత విషయాల్లో ప్రసాద్ పాత్ర కీలకం. ఆయన లేకుండా సుక్కు ఏ పని చేయలేడని అంటారు. సుక్కు అంతగా ఆధారపడే వ్యక్తి నెల కిందట హఠాత్తుగా మరణించారు. ఆయనకు బీపీ, షుగర్ ఉన్నాయి. చాలా ఏళ్లుగా క్రమం తప్పకుండా మందులేసుకుంటూ ఉన్నాడు. ఐతే ఈ మధ్య కొంచెం నిర్లక్ష్యం చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.
అప్పటి నుంచి సుక్కు శోకంలో ఉన్నాడు. కొన్ని రోజుల పాటు మిత్రుడు లేక ఆయన డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు సన్నిహితుల సమాచారం. ఈ మధ్య కొంచెం కోలుకున్నాడు. ఇంతలో ప్రసాద్ పుట్టిన రోజు రావడంతో తన మిత్రుడిని ఉద్దేశించి ఒక హార్ట్ టచింగ్ పోస్టు పెట్టాడు. నెల రోజులకు పైగా కనిపించకుండా పోయిన తన మిత్రుడు మళ్లీ తన దగ్గరికి వచ్చినట్లు.. లాక్ డౌన్లో కూడా స్వేచ్ఛగా తిరిగేస్తున్నట్లు.. మందుల గురించి అడిగితే ఇప్పుడు తనకే ఇబ్బందీ లేదని.. బిందాస్‌గా తిరిగేస్తున్నానని చెప్పినట్లు.. ఇలా వర్ణించుకుంటూ వెళ్లాడు సుక్కు.
లాక్ డౌన్ అయ్యాక రా చాలా పనుంది అని అంటే.. ప్రసాద్ నవ్వుతూ ఉండిపోగా ఉన్నట్లుండి అలారం మోగి తనకు మెలకువ వచ్చినట్లు సుక్కు పేర్కొన్నాడు. అంటే తన మిత్రుడు మళ్లీ తన దగ్గరికి వచ్చినట్లు సుక్కు కలగన్నాడన్నమాట. వాస్తవంలోకి వచ్చాక ‘‘ఇప్పుడర్థమైంది లేకపోవడం అంటే ఏంటో. లేకపోవడం అంటే ఈ బతుకు అనే లాక్ డౌన్లో బందీగా ఉండటమే’’ అంటూ సుక్కు ముగించాడు. ఇది రాసిన సందర్భం గురించి చెబుతూ.. ‘‘లాక్ డౌన్లో కూడా నా జ్ఞాపకాల్లో స్వేచ్ఛగా తిరిగేస్తున్న బావగాడికి జన్మదిన శుభాకాంక్షలు’’ అని సుక్కు అన్నాడు.
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…