Movie News

వెనక్కెళ్లిపోయిన వరుణ్ తేజ్

కొన్ని వారాల కిందట టాలీవుడ్లో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ల జాతర నడిచింది. ఒకరిని చూసి ఒకరు వరుసగా కొత్త చిత్రాల విడుదల తేదీలు ప్రకటించారు. వేరే వాళ్లతో మాట్లాడకుండా.. ఎప్పుడే సినిమా వస్తుందో తెలియకుండా హడావుడిగా ప్రకటనలు చేసేశారు. తర్వాత చూస్తే క్లాష్ తప్పదని, తమకు నష్టం వాటిల్లుతుందని అర్థమైంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు డేట్లు మార్చుకునే పనిలో పడ్డారు.

టక్ జగదీష్, సీటీమార్, నారప్ప లాంటి సినిమాలకు ఇలాగే డేట్లు మారబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలోకి వరుణ్ తేజ్ కొత్త చిత్రం ‘గని’ కూడా చేరబోతుండటం స్పష్టం. ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు గత నెలలో ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన వారాంతంలో సినిమాను షెడ్యూల్ చేసుకున్నాడంటూ వరుణ్ అభిమానులు సంతోషించారు. కానీ ఇప్పుడు ఆ డేట్‌ను వదులుకోక తప్పట్లేదు.

ప్రభాస్ భారీ చిత్రం ‘రాధేశ్యామ్’ను అదే తేదీకి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా మూవీ. వివిధ పరిశ్రమల్లో సంప్రదింపులు జరిపి, ఇతర భాషల్లో పోటీ లేకుండా చూసుకుని ఈ డేట్ అనౌన్స్ చేశారు. ‘గని’కి డేట్ ఇచ్చేశారు కదా అని వాళ్లేమీ రాజీ పడట్లేదు. ‘రాధేశ్యామ్’ ఈ తేదీకి రావొచ్చని ముందే సంకేతాలు అందినా తమను సంప్రదించకుండా డేట్ ఇచ్చేసిన నేపథ్యంలో యువి క్రియేషన్స్ వాళ్లు వెనక్కి తగ్గేలా లేరు. అలాగని ‘రాధేశ్యామ్’కు పోటీగా ‘గని’ని విడుదల చేయడమూ శ్రేయస్కరం కాదు. ఈ నేపథ్యంలో ఆ చిత్రానికి వేరే డేట్ చూసుకోక తప్పదు.

హడావుడిగా డేట్ ఇచ్చేశారు కానీ.. ‘గని’ షూటింగ్ చాలానే మిగిలుంది. ఇప్పుడే ఆ చిత్రం సెకండ్ షెడ్యూల్‌ను మొదలుపెట్టింది. కాబట్టి హడావుడి లేకుండా ఈ చిత్రాన్ని సెప్టెంబరులో విడుదల చేద్దామని ఫిక్సయ్యారట. ఆగస్టులోనూ ‘పుష్ప’ సహా కొన్ని భారీ చిత్రాలు షెడ్యూల్ అయి ఉన్న నేపథ్యంలో సెప్టెంబరు మొదటి వారానికి ‘గని’ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల తర్వాత పూర్తి స్పష్టత వచ్చాక డేట్ అనౌన్స్ చేస్తారట.

This post was last modified on February 18, 2021 7:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ వేగాన్ని రెహమాన్ అనుభవం తట్టుకోగలదా

పెద్ది టీజర్ వచ్చాక ఎన్నో టాపిక్స్ మీద చర్చ జరుగుతోంది. దీనికి ప్యారడైజ్ కి రిలీజ్ డేట్ల క్లాష్ గురించి…

1 hour ago

బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వం.. ఏర్పాట్లు స‌రే.. అస‌లు స‌మ‌స్య ఇదే!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వాల‌కు రెడీ అయింది. ఈ నెల 27వ తేదీకి బీఆర్ ఎస్‌(అప్ప‌టి…

1 hour ago

పవన్ ‘బాట’తో డోలీ కష్టాలకు తెర పడినట్టే!

డోలీ మోతలు... గిరిజన గూడేల్లో నిత్యం కనిపించే కష్టాలు. పట్టణ ప్రాంతాలు ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. పూర్తిగా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న…

2 hours ago

ఇలాంటి క్లైమాక్స్ ఇప్ప‌టిదాకా ఎక్కడా రాలేదు – క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి మీద ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. అమిగోస్, డెవిల్…

5 hours ago

క‌మ్యూనిస్టులకు కొత్త సార‌థి.. ఎవ‌రంటే!

క‌మ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సార‌థి వ‌చ్చారు. తమిళ‌నాడులో జ‌రుగుతున్న 24వ అఖిల భార‌త మ‌హా స‌భల వేదిక‌గా.. కొత్త…

5 hours ago

సల్మాన్ సినిమా పరిస్థితి ఎంత ఘోరమంటే?

బాలీవుడ్ ఆల్ టైం టాప్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ వస్తే చాలు.. వందల…

8 hours ago