బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు కుదిరే కాంబినేషన్లు చూస్తే జనాలకు భలే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అతనేమీ పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి రాలేదు. హీరోగా తొలి సినిమాను మినహాయిస్తే మరే చిత్రాన్ని అతడి తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించలేదు. చాలా వరకు పెద్దగా పేరు లేని బేనర్లలోనే నటించాడు. కానీ ఆ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్లలో తెరకెక్కాయి. పెద్ద పెద్ద దర్శకులు, టెక్నీషియన్లు, నటీనటులతో అతడికి కాంబినేషన్లు కుదిరాయి. ఏమాత్రం రాజీ లేకుండా ఆయా సినిమాలను నిర్మించారు.
శ్రీనివాస్ చివరగా నటించిన ‘అల్లుడు అదుర్స్’ను సైతం పెద్ద బడ్జెట్లో ఓ కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేశాడు. దీని తారాగణం, టెక్నీషియన్ల సంగతి తెలిసిందే. ఐతే ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే సురేష్ తెర వెనుక ఉండి వేరే నిర్మాతల్ని పెట్టి కొడుకుతో సినిమాలు తీయిస్తాడని. ఆ సినిమాలను మార్కెట్ చేయడం, పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం, నష్టాలొస్తే డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ చేయడం అంతా సురేషే చూసుకుంటాడని అంటారు.
ఐతే బెల్లంకొండ శ్రీనివాస్‌ను పెద్ద స్టార్ లాగా అతడి సినిమాల్లో ప్రొజెక్ట్ చేయడం చూస్తుంటాం కానీ.. అతడిని ఏ పేరున్న బేనర్ కూడా పిలిచి సినిమా చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. ఐతే తొలిసారిగా ఓ పెద్ద సంస్థలో అతను ఓ సినిమా చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. ప్రస్తుతం శ్రీనివాస్ దృష్టంతా ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్ మీదే ఉంది. ఈ సినిమా కోసమే ముంబయిలో ఉండి ప్రిపేరవుతున్నాడతను. ఆ సినిమా పూర్తి చేశాక తిరిగి టాలీవుడ్‌కు వచ్చి యువి క్రియేషన్స్ బేనర్లో ఓ సినిమా చేస్తాడట శ్రీనివాస్. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట.
‘మిర్చి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన యువి క్రియేషన్స్ ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్లో యువ కథానాయకులతో సినిమాలు తీస్తూ వస్తోంది. ఈ కోవలోనే శ్రీనివాస్ హీరోగా కొత్త దర్శకుడితో తక్కువ బడ్జెట్లో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసిందట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం.
This post was last modified on February 16, 2021 8:41 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…