ఓ సినిమా కోసం వేసిన సెట్ ని మరో సినిమా కోసమూ వాడేయడం ఈరోజుల్లో అరుదైన విషయమే. ఎందుకంటే.. ప్రేక్షకులు ఇట్టే పట్టేస్తున్నారు. ‘ఇది ఫలానా సినిమాలో ఉంది కదా’ అని చెప్పేస్తున్నారు.
అందుకే… సెట్స్‌ని రిపీట్ చేయడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పాత సెట్లకే కొత్త హంగులు పూసి.. వాడుకోవాల్సివస్తుంది. ‘ఆచార్య’ విషయంలో అదే జరుగుతోంది.
‘పుష్ష’ కోసం వేసిన సెట్లో ఇప్పుడు ‘ఆచార్య’ రంగంలోకి దిగబోతున్నాడు. ‘పుష్ష’ షూటింగ్ ఇటీవల మారేడు మల్లిలో జరిగింది. అక్కడ షెడ్యూల్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చే వారంలో ‘ఆచార్య’ షూటింగ్ అక్కడే జరగబోతోంది. మారేడు మల్లిలో ‘పుష్ష’ పెద్ద షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఎక్కువ రోజులు అక్కడ ఉండాల్సిరావడంతో.. కొన్ని గెస్ట్ హోస్‌లను నిర్మించుకుంది.
అక్కడే ఇప్పుడు ‘ఆచార్య’ యూనిట్ కూడా ఉండబోతోంది. పుష్ష కోసం వేసిన సెట్లని చిన్న చిన్న మార్పులు చేసుకుని ‘ఆచార్య’ కోసం వాడుకోబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారట. వారం పది రోజుల్లో ఇక్కడి షెడ్యూల్ పూర్తవుతుందని, ఆ తరవాత హైదరాబాద్ లో చిరు – చరణ్‌లపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. మే 13న ఆచార్య విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 9, 2021 3:01 pm
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…