సంక్రాంతికి అటు తమిళంలో, ఇటు తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘మాస్టర్’ సినిమా. ఈ చిత్రానికి టాక్ ఆశించిన విధంగా లేకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం దీనికి మంచి ఫలితమే దక్కింది. ముందు నుంచి ఉన్న హైప్, విజయ్ క్రేజ్ కలిసొచ్చి ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. తెలుగులో ఈ చిత్రానికి తెల్లవారుజామున పెద్ద ఎత్తున షోలు పడటం, అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరగడం చూసి మన సినీ జనాలు షాకయ్యారు. ఒకప్పుడు విజయ్ సినిమా తెలుగులో నామమాత్రంగా రిలీజయ్యేది. అలాంటిది ఇప్పుడు డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు మంచి లాభాలు రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
ఐతే ‘ఖైదీ’ తర్వాత తనపై పెట్టుకున్న భారీ అంచనాలను ఈ సినిమాతో అందుకోలేకపోయాడు యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్. అతను తన మార్కు సినిమా కాకుండా విజయ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక సగటు కమర్షియల్ సినిమా తీశాడనే విమర్శలు వచ్చాయి. ఐతే టాక్ ఎలా ఉన్నప్పటికీ సినిమా బాగా ఆడిన నేపథ్యంలో లోకేష్‌తో మళ్లీ జట్టు కట్టడానికి విజయ్ రెడీ అయిపోయాడన్నది తాజా సమాచారం.
‘మాస్టర్’ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ అనే మరో యువ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు విజయ్. సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిజానికి మురుగదాస్ దర్శకత్వంలో ఈ బేనర్లో సినిమా చేయాల్సింది విజయ్. కానీ స్క్రిప్టు నచ్చక మురుగదాస్‌ను తప్పించారు. ఆ స్థానంలోకి దిలీప్ వచ్చాడు.
దీని తర్వాత విజయ్‌తో పని చేయడానికి చాలా మంది దర్శకులు లైన్లో ఉండగా.. అతను మాత్రం మళ్లీ లోకేష్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తనకు ఓ దర్శకుడు నచ్చితే వరుసగా సినిమాలు చేస్తుంటాడు. మురుగదాస్‌తో కూడా అలాగే చేశాడు. కానీ అతను ఫామ్ కోల్పోయేసరికి నాలుగో సినిమాకు పక్కన పెట్టక తప్పలేదు. మరి విజయ్‌తో తీసిన తొలి సినిమాలో తన ముద్ర చూపించలేకపోయిన లోకేష్.. రెండో సినిమాలో అయినా తనపై పెట్టుకున్న అంచనాల్ని నిలబెట్టుకుంటాడేమో చూడాలి.
This post was last modified on February 9, 2021 2:30 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…