ఉప్పెన సినిమా ఎలా ఉంటుందో? హీరోగా వైష్ణవ్ తేజ్ కెరీర్ సంగతేంటో.. తెలీదు గానీ, కథానాయికగా కృతి శెట్టి మరో మరో రెండేళ్లు ఈ టాలీవుడ్ ని ఏలేయడం ఖాయం. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా.. గంపెడు అవకాశాల్ని అందేసుకుంటోంది కృతి శెట్టి. ఇప్పటికే నాని సినిమాలో హీరోయిన్ గా బుక్కయిపోయింది. ఇప్పుడు అఖిల్ – సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా తనకే ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.
అంతే కాదు.. నాగశౌర్య హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోబోతోందని, అందులో.. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుందని సమాచారం అందుతోంది. తమిళ సినిమా దృష్టి కూడా కృతిపై పడిందని, సూర్య సినిమాలో కథానాయికగా కృతి ఎంపికైపోయిందని ఓ ప్రచారం సాగుతోంది.
అందులో ఎంత వరకూ నిజం ఉందో తెలీదు గానీ.. 2021కి సంబంధించిన కృతి డైరీ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినట్టే. ఉప్పెన గనుక సూపర్ హిట్టయిపోయతే.. 2022 కాల్షీట్లూ ఇప్పుడే ఇచ్చేయాల్సి ఉంటుంది.
This post was last modified on February 8, 2021 12:04 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…