కెరీర్లో తొలిసారి రెడ్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు యువ కథానాయకుడు రామ్. తమిళ హిట్ తడమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఆదిత్య, సిద్దార్థ్ పాత్రల్లో రామ్ బాగానే వైవిధ్యం చూపించాడు. ద్విపాత్రాభినయం చేయడంలో ఏమాత్రం తడబడినట్లు కనిపించలేదు. ఈ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రామ్.. ఈసారి ఏకంగా ట్రిపుల్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా ఒక క్రేజీ రూమర్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుండటం విశేషం.
ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు రామ్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. అందులో రామ్ త్రిపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు. రామ్ నుంచి హామీ అందుకున్న ఆ యువ దర్శకుడు ఈ సినిమా గురించి తన సన్నిహితులతో చెప్పుకోగా.. ఈ వార్త బయటికి వచ్చింది.
కొత్త దర్శకుడితో కొంచెం రిస్క్‌తో కూడుకున్న సబ్జెక్ట్ కావడంతో ఈ చిత్రాన్ని కూడా తన హోం బేనర్ స్రవంతి మూవీస్‌లోనే రామ్ చేయబోతున్నాడని అంటున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముంది. రెడ్ తర్వాత రామ్ కొత్త సినిమా ఎంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.
రెడ్ గత ఏడాది మార్చిలోనే పూర్తయింది. అప్పట్నుంచి అతను ఖాళీగానే ఉన్నాడు. మధ్యలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. త్రివిక్రమ్ ఈ వేసవి నుంచి ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటీవలే స్వామి మాల వేసుకున్న రామ్.. కొంచెం గ్యాప్ తీసుకుని త్వరలోనే రీఎంట్రీ ఇస్తానన్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. ఈ మాల తీయగానే రామ్ కొత్త సినిమాను మొదలుపెడతాడని అంటున్నారు.
This post was last modified on February 8, 2021 11:52 am
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…