గత పదేళ్లలో ఇండియాలో వచ్చిన గొప్ప నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. అతను తమిళుడే కానీ.. వివిధ భాషల్లో తనకు భారీగా అభిమానగణం ఉంది. భాషల హద్దులు చెరిగిపోయి ఓటీటీల ద్వారా అన్ని సినిమాలూ అందరూ చూసేస్తున్న నేపథ్యంలో సేతుపతి టాలెంట్ ఏంటో అందరికీ బాగానే తెలుస్తోంది. హీరో ఎవరన్నది చూడకుండా ఒక సినిమాలో సేతుపతి ఉన్నాడంటే ఆ సినిమా చూసే ప్రేక్షకులు భారీగా ఉన్నారు.
మొన్న సంక్రాంతికి విడుదలైన ‘మాస్టర్’ సినిమాలో హీరో విజయ్‌ను మించి సేతుపతే హైలైట్ అయ్యాడు. ఎంత మామూలు పాత్రనైనా తనదైన నటనతో ప్రత్యేకంగా మార్చడం సేతుపతికే చెల్లు. అలాంటి నటుడు సుకుమార్ లాంటి మేటి దర్శకుడి సినిమాలో ఉంటే.. సుక్కు మార్కు టిపికల్ క్యారెక్టర్‌లో నటిస్తే ఆ పాత్ర ఎంతగా హైలైట్ అవుతుందో, సినిమాకు ఎంత క్రేజ్ వస్తుందో చెప్పేదేముంది? ఈ కాంబినేషన్ ఓకే అయినట్లే అయి బ్రేక్ అయిపోవడం నిరాశ కలిగించింది.
సుక్కు కొత్త సినిమా ‘పుష్ప’లో విలన్ పాత్రకు ముందు అనుకున్నది విజయ్ సేతుపతినే. అతణ్ని దృష్టిలో ఉంచుకునే ఆ పాత్ర డిజైన్ చేశాడు సుక్కు. ముందు సేతుపతి సైతం ఈ సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నాడు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కడంలో బాగా ఆలస్యం జరిగింది. దీనికి తోడు కరోనా వచ్చి విజయ్ సేతుపతి చేస్తున్న వేరే సినిమాల షెడ్యూళ్లను దెబ్బ తీసింది. ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదా ఆ ప్రభావం పడింది. దీంతో ‘పుష్ప’కు డేట్లు సర్దుబాటు చేయలేనంటూ అతను ఈ సినిమాకు దూరమయ్యాడు. మళ్లీ ప్రయత్నించినా కూడా కాల్ షీట్లు కేటాయించలేకపోయాడు. ఈ పాత్రకు వేరే నటుల పేర్లు కొన్ని పరిశీలించాడు కానీ.. దేన్నీ ఖరారు చేయలేదు సుక్కు. విలన్ సంగతి తేల్చకుండానే రెండు నెలలుగా షూటింగ్ చేస్తున్నాడు. సినిమాలో విలన్ పాత్ర ద్వితీయార్ధంలో వస్తుందట.
దానికి ముందొచ్చే సన్నివేశాలన్నీ తీసేస్తున్నారు. ఇంకో నెల రోజుల తర్వాత విలన్ పాత్రతో సీన్స్ తీయాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఆ నటుడెవరన్నది తేల్చలేదు. ఇదిలా ఉంటే ‘ఉప్పెన’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సుక్కు, సేతుపతి ఒకరి గురించి ఒకరు మాట్లాడారు. ‘ఉప్పెన’ కోసం తాను పట్టుబట్టి సేతుపతితో విలన్ పాత్ర చేయించానని, చెన్నైకి వెళ్లి సేతుపతితో మాట్లాడనని సుక్కు చెప్పాడు. కానీ ‘పుష్ప’లో సేతుపతి నటించడం గురించి మాత్రం సుక్కు ప్రస్తావించలేదు. తర్వాత సేతుపతి మాట్లాడుతూ.. సుక్కు అంటే తనకెంతో ఇష్టమని చెప్పి, ‘నాకో ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్’ అని అడిగాడు. ఐతే సేతుపతితో పని చేయడానికి సుక్కు ఆసక్తిగానే ఉన్నప్పటికీ.. అతనే డేట్లు సర్దుబాటు చేయలేకపోతున్నది ‘పుష్ప’ టీం టాక్.
This post was last modified on February 7, 2021 2:46 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…