ఈ మధ్యే ‘ఆచార్య’ టీజర్ అప్‌డేట్ రాబోతుండగా.. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్లో ఒక మీమ్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ అప్‌డేట్ ఇవ్వకుంటే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా అంటూ తన మీద తానే పంచ్ వేసుకున్నాడు చిరు. దీన్ని బట్టి సోషల్ మీడియాలో జనం తన గురించి ఏమనుకుంటున్నారో చిరుకు బాగానే తెలుస్తున్నట్లే ఉంది. ఆ మధ్య ‘పిట్ట కథ’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో భాగంగా అనుకోకుండా కొరటాల శివ దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమా పేరు ‘ఆచార్య’ అని లీక్ చేసేశారు చిరు.
యథాలాపంగా తాను చేస్తున్న సినిమా ‘ఆచార్య’ అనేసి.. ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు చిరు. ఇక ఆయనేదైనా సినిమా వేడుకల్లో పాల్గొన్నా అత్యుత్సాహంతో ఆ సినిమా విశేషాలు బయటపెట్టేస్తుంటారని, అలాగే ఇంకా ఖరారు కాని కాంబినేషన్ల గురించి రివీల్ చేసేస్తాడని కూడా పేరు పడిపోయింది చిరుకు. ఈ నేపథ్యంలోనే ‘ఉప్పెన’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన బలహీనత గురించి ఆయన మాట్లాడారు.
తాను మైక్ పట్టుకుంటే చాలు సినిమా విశేషాలన్నీ లీక్ చేసేస్తానేమో అని ‘ఉప్పెన’ నిర్మాతలు భయపడుతున్నారని, కానీ ‘ఉప్పెన’ విశేషాలేమీ బయటపెట్టనని అనడం ద్వారా తనను తాను ముందే నియంత్రించుకున్నారు చిరు. ఈ సందర్భంగానే తన బలహీనత గురించి కూడా ఆయన గుర్తు చేుసుకున్నారు. ‘ఉప్పెన’ సినిమా చూడగానే తాను ఆత్రం ఆపుకోలేక ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలన్నీ చెప్పేసి అందరూ ఈ సినిమాను కచ్చితంగా చూడాలని చెప్పాలని అనుకున్నానని ఈ సందర్భంగా చిరు చెప్పడం విశేషం.
మధ్యలో ఒక చోట సినిమాలోని ఒక డేంజర్ పాయింట్ అంటూ.. దాని గురించి రివీల్ చేయనంటూ మరోసారి తనను తాను నియంత్రించుకున్నారు చిరు. ఇంతా చేసి చివరికి వచ్చేసరికి చిరు ఒక సీక్రెట్ రివీల్ చేసేయడం విశేషం. బాబీ దర్శకత్వంలో తాను చేయబోయే కొత్త సినిమాను నిర్మించబోయేది మైత్రీ అధినేతలే అని చిరు వెల్లడించాడు. బహుశా మైత్రీ వాళ్లు ఘనంగా ఈ ప్రాజెక్టును ప్రకటించాలనుకున్నారేమో. కానీ చిరు అలవాటులో పొరబాటుగా ఈ కాంబినేషన్ గురించి చెప్పేసి తనకున్న ‘లీకు వీరుడు’ పేరును నిలబెట్టుకున్నట్లయింది.
This post was last modified on February 7, 2021 2:49 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…