సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ఊపందుకోబోతోంది. ఆయన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే ‘శేఖర్’ పేరుతో ఓ సినిమాను మొన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళ హిట్ మూవీ ‘జోసెఫ్’కు అది రీమేక్. ఈ సినిమా కోసం పూర్తిగా డీగ్లామరస్ లుక్‌లోకి మారిపోయారు రాజశేఖర్. ఇప్పటిదాకా ఏ సినిమాలో కనిపించని విధంగా తెల్లటి గడ్డం, ముడతల ముఖంతో సరికొత్తగా ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమాను లలిత్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు.
దీని తర్వాత మరో యువ దర్శకుడితో పని చేయబోతున్నాడు రాజశేఖర్. అతడి పేరు కిరణ్ కొండమడుగుల. ఇతను అమేజాన్ ప్రైమ్‌లో రిలీజై మంచి రివ్యూలు తెచ్చుకున్న ‘గతం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అందరూ కొత్త నటీనటులతో ఓ ఇంటెన్స్ థ్రిల్లర్ తీసి మెప్పించాడు కిరణ్. ఇప్పుడతను రాజశేఖర్ హీరోగా సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ప్రి లుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. పోస్టర్ మీద ఉమన్ ట్రాఫికింగ్ మీద వచ్చిన ఒక సంచలన వార్త హైలైట్ అవుతున్న న్యూస్ పేపర్, గన్ను, గాగుల్స్, సిగరెట్ దర్శనమిస్తున్నాయి.
దీన్ని బట్టి ఇది ఒక కాప్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది. మహిళలను కిడ్నాప్ చేసి బ్రోతల్ హౌస్‌లకు అమ్మేసే ముఠా మీద పోరాటం చేసే పోలీసాఫీసర్ పాత్రలో రాజశేఖర్ కనిపిస్తాడనే సంకేతాలు అందుతున్నాయి. సృజన్, భార్గవ, హర్ష ప్రతాప్ అనే కొత్త నిర్మాతలతో కలిసి రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక రకంగా రాజశేఖర్ సొంత సినిమాగానే చెప్పాలి దీన్ని. ‘గరుడవేగ’; కల్కి’ చిత్రాల తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. ఒకేసారి రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టడం విశేషమే.
This post was last modified on February 6, 2021 5:05 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…