అదిగో సినిమా అంటే… ఇదిగో రిలీజ్ డేట్ అన్నట్టు తయారైంది టాలీవుడ్ యవ్వారం. అందుకే రిలీజ్ డేట్ల జాతర కొనసాగుతోంది. అంతెందుకు… సినిమా మొదలెట్టకుండానే, అక్టోబరు 1న సినిమా విడుదల చేస్తున్నాం, అంటూ షాకిచ్చాడు మారుతి.
ఇలా.. అంతా రిలీజ్ డేట్లు ప్రకటించుకోవడంలో బిజీ అయిపోయారు. క్రిష్ మాత్రం నోరు మెదపడం లేదు. అటు పవన్ సినిమా రిలీజ్‌డేట్ రాలేదు, ఇటు వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పలేదు.
పవన్ సినిమా 2022లోనే అని టాక్. వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ లతో క్రిష్ ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా దాదాపు అయిపోయింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంకా రాలేదు. దానికి ఓ బలమైన కారణం ఉంది. ఈసినిమాకి గ్రాఫిక్స్ తో చాలా పని ఉంది. అందుకోసం దాదాపు 4 నెలలు సమయం కేటాయించాలట. గ్రాఫిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆ పనులు ఓ పట్టాన తెవలవు. 4 నెలలు అనుకున్నది కాస్త 6 నెలలు అవ్వొచ్చు. అది గ్రాఫిక్స్ కంపెనీ నైపుణ్యం పై ఆధారపడి ఉంటుంది. గ్రాఫిక్స్ నచ్చకపోతే.. తిరిగి మళ్లీ చేయించుకోవాలి.
అందుకే…విజువల్ ఎఫెక్ట్స్ పనులు అయ్యేంత వరకూ… ఈ సినిమా రిలీజ్ డేట్ చెప్పకూడదని క్రిష్ ఫిక్సయ్యాడని టాక్. కొండపొలెం అనే ప్రసిద్ధమైన నవల ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతోంది. అటవీ నేపథ్యమైన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ గ్రాఫిక్స్ లోనే తీయాలి. అన్నట్టు ఈ సినిమాకి జంగిల్ బుక్ అనే పేరు పరిశీలిస్తున్నారు.
This post was last modified on February 6, 2021 12:30 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…