తెలుగులో దటీజ్ మహాలక్ష్మి.. తమిళంలో ప్యారిస్ ప్యారిస్.. కన్నడ, మలయాళ భాషల్లో ఇంకేవో పేర్లు. ఒకేసారి నాలుగు భాషల్లో ఓ సినిమా రీమేక్ కావడం, ఒక్కో భాషలో ఒక్కో కథానాయిక లీడ్ రోల్ చేయడం.. అన్నీ ఒకే లోకేషన్లలో వేర్వేరుగా చిత్రీకరణ జరుపుకోవడం.. ఒకేసారి పూర్తి కావడం అరుదైన విషయమే. కానీ ఈ నాలుగు సినిమాల విడుదల సంగతే ఎటూ తేలకుండా పోయింది. బాలీవుడ్లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వికాస్ బల్ రూపొందించిన ‘క్వీన్’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు కావస్తోంది. ‘క్వీన్’ వచ్చిన ఏడాదికే సౌత్ రీమేక్ గురించి వార్తలు మొదలయ్యాయి.
ఈ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. కానీ కాస్ట్ అండ్ క్రూను ఖరారు చేయడానికే ఏళ్లకు ఏళ్లు పట్టేశాయి. ఎట్టకేలకు రెండేళ్ల కిందట ‘క్వీన్’ రీమేక్‌లు పట్టాలెక్కాయి. తెలుగు వెర్షన్ దర్శకుడు నీలకంఠ మధ్యలో బాధ్యతలు వదిలేసి వెళ్లిపోగా.. ప్రశాంత్ వర్మ మిగతా పని పూర్తి చేశాడు.
ఏడాది కిందటే నాలుగు భాషల్లోనూ క్వీన్ రీమేక్‌లు ఫస్ట్ కాపీలతో రెడీ అయ్యాయి. కానీ అవి ఎంతకీ విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ‘క్వీన్’ నాలుగు టీజర్లలో ప్రేక్షకుల దృష్టిని ఎక్కువ ఆకర్షించింది కాజల్ చేసిన తమిళ వెర్షనే. దానికి కూడా టీజర్లోని ఒక బోల్డ్ షాట్ కారణం. తెలుగులో తమన్నా వెర్షన్‌కు స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. కన్నడ, మలయాళ వెర్షన్లపైనా పెద్దగా ఆసక్తి కనిపించలేదు.
కనీసం త్వరగా ఈ సినిమాలను రిలీజ్ చేసినా ఒక లెక్క. కానీ ఏం ఇబ్బందులో ఏమో కానీ.. కరోనాకు ముందు థియేటర్లు తెరిచి ఉన్నప్పుడూ ఈ సినిమాలను రిలీజ్ చేయలేదు. లాక్ డౌన్ టైంలో ఓటీటీలకూ ఇచ్చేయలేదు. ఇప్పుడు థియేటర్లు పున:ప్రారంభమయ్యాక కూడా ఆ సినిమాల గురించి చప్పుడే లేదు. ఈ సినిమాలకు పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవరికి వాళ్లు వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. వాళ్లెవ్వరికీ సినిమాలపై పెద్దగా ఆశలు, ఆసక్తి కూడా ఉన్నట్లు లేదు. అంత ఖర్చు పెట్టి రీమేక్ రైట్స్ కొని, సినిమాలు తీసి ఇలా చేజేతులా వాటిని చంపేయడమేంటో?
This post was last modified on %s = human-readable time difference 10:42 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…