ఏపీలో తీవ్ర కలకలం రేపిన రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అప్పటికే షెడ్యూల్ ప్రకటించేసిన స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా నిలిపివేస్తున్నట్లుగా నిమ్మగడ్డ… జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు పెద్ద షాకే ఇచ్చారు. ఈ క్రమంలో నిమ్మగడ్డ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ సర్కారు… వ్యూహాత్మకంగా ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చి నిమ్మగడ్డను ఆ పదవి నుంచి తప్పించేసి… ఆ పదవిలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించేసింది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు గడప తొక్కింది. ఇదిలా ఉంటే.. ఎన్నికలను వాయిదా వేసిన తనకు భద్రత కల్పించాలంటూ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై పెను దుమారమే రేగింది. ఈ లేఖ నిమ్మగడ్ తన కార్యాలయంలో రాయలేదని, బయట ఎక్కడో తయారైన ఈ లేఖను నిమ్మగడ్డ కేంద్రానికి పంపారన్న వాదనలు వినిపించాయి. దీనిపై దర్యాప్తు సాగిస్తున్న ఏపీ సీఐడీ ఇప్పటికే నిమ్మగడ్డకు పీఎస్ గా వ్యవహరించిన సాంబమూర్తిని విచారించింది. అయితే ఈ విషయంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏకంగా నిమ్మగడ్డను కూడా విచారించే అవకాశాలున్నాయంటూ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బుధవారం చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపుతున్నాయి.
ఈ దిశగా సునీల్ కుమార్ ఏమన్నారన్న విషయానికి వస్తే… ‘‘నిమ్మగడ్డ రాసిన లేఖ ఎస్ఈసీ కార్యాలయంలో రాసినది కాదు. ఈ లేఖను ఎక్కడ తయారు చేశారనే విషయంపై రమేశ్ కుమార్ పర్సనల్ సెక్రటరీ సాంబమూర్తిని విచారించాం. ఎస్ఈసీ రమేశ్ కుమార్ డిక్టేట్ చేస్తుంటే తాను డెల్ ల్యాప్ టాప్ లో టైప్ చేశానని ఆయన చెప్పారు. ఆ తర్వాత దాన్ని స్కాన్ చేశాను, సంతకం తీసుకున్నాను, వాట్సాప్ పంపించాను అంటూ ఆయన ఒక కథనాన్ని చెప్పారు. ఇదే సమయంలో తాము అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పలేకపోయారు. ఆ ఫైల్ ఎక్కడుందని అడిగితే డిలీట్ చేశానని చెప్పారు. ఎందుకు డిలీట్ చేశారని అడిగితే సమాధానం చెప్పలేకపోయారు. కాన్ఫిడెన్షియల్ లెటర్ కదా అని అనుకున్నప్పటికీ… హార్డ్ డిస్క్ మొత్తాన్ని ఫార్మాట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం లేదు. ఆ లెటర్ ఆఫీసులో తయారు కాలేదు, బయట తయారయిందనేదే అసలైన అభియోగం. ఆ లేఖ అక్కడే తయారైనట్టు తేలి ఉంటే అంతటితో విచారణ ముగిసేది. అక్కడ తయారు కాలేదనే కోణంలోనే విచారణను ముందుకు తీసుకెళ్లాం. నిమ్మగడ్డ రమేశ్ ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని… అయితే ఆయన వెర్షన్ ఏమిటో కూడా తెలుసుకోవాలని, విచారణలో ఇదొక భాగం’’ అని సునీల్ కుమార్ చెప్పారు.
సునీల్ కుమార్ వెర్షన్ చూస్తుంటే… నిమ్మగడ్డను సీఐడీ విచారించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారిని విచారణకు పిలవడమంటేనే ఓ పెద్ద తతంగం. మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయి ఉండి… రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డను విచారించడమంటే మరింత పెద్ద తతంగమే కదా. అంతేకాకుండా తనను టార్గెట్ చేసి మరీ వైసీపీ సర్కారు వేధిస్తోందని ఇప్పటికే నిమ్మగడ్డ హైకోర్టుకు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న తనకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని నిమ్మగడ్డ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. దీనిపైనే ఇప్పుడు రచ్చ సాగుతుంటే… ఇప్పుడు ఏకంగా నిమ్మగడ్డను విచారించాల్సి ఉందంటూ సీఐడీ చీఫ్ పేర్కొనడం మరింత సంచలనంగా మారిందనే చెప్పాలి. మరి ఈ వ్యవహారంలో మరెన్ని సంచలనాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
This post was last modified on May 6, 2020 10:00 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…