ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సెలబ్రెటేడ్, పాపులర్ కపుల్ అంటే విరాట్ కోహ్లి, అనుష్క శర్మలే. ఒకరేమో క్రికెట్లో సూపర్ స్టార్. ఇండియాలో ప్రస్తుతం అత్యంత ఆదరణ ఉన్న క్రికెటర్. ఇంకొకరేమో బాలీవుడ్లో పెద్ద స్టార్. ఇలాంటి జంట ఒక్కటైతే వాళ్లకుండే క్రేజ్ ఎలాంటిదో చెప్పేదేముంది? కొన్నేళ్ల ప్రేమ తర్వాత మూడేళ్ల కిందటే పెళ్లి చేసుకున్న విరుష్క జోడీ ఇటీవలే తొలి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ టైంలోనే అనుష్క గర్భవతి అనే విషయం వెల్లడైంది. భార్య ప్రసవం కోసం విరాట్.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ అవ్వగానే స్వదేశానికి వచ్చేశాడు కూడా. జనవరి 11న వీరికి పాప పుట్టింది. ఈ పాపకు ఏం పేరు పెడతారా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆ విషయం ఇప్పుడు వెల్లడైంది.
వామిక.. ఇదీ విరాట్-అనుష్కల ముద్దుల తనయ పేరు. తన పాపను అనుష్క ఎత్తుకుని ఆమెతో పాటు కోహ్లి బిడ్డను మురిపెంగా చూస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది అనుష్క. ఈ సందర్భంగానే తమ పాపకు వామిక అని పేరు పెట్టుకున్నట్లు వెల్లడించారు.
ఈ ఫొటోకు ఎమోషనల్ రైటప్ కూడా జోడించింది అనుష్క. ‘‘మేము ప్రేమలో కలిసి ఉన్నాం. మా ప్రేమ మరియు విశ్వాసం వామిక రాకతో మరికొత్త రూపం సంతరించుకుంది. కన్నీళ్లు, నవ్వు, ఆందోళన, ఆనందం.. కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభవించిన భావోద్వేగాలు.. మీ కోరికలు, ప్రార్థనలు మాకు మరింత శక్తిని ఇచ్చాయి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని అనుష్క పేర్కొంది. మన పురాణాల ప్రకారం వామిక అనేది దుర్గామాతకు మరో పేరు. మరి విరాట్-అనుష్కల చిన్నారి దుర్గామాత లాగే అత్యంత శక్తిమంతురాలిగా మారి తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని ఆశిద్దాం.
This post was last modified on February 1, 2021 2:14 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…