టాలీవుడ్లో ఇప్పుడు వరుసబెట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. అన్ని సినిమాల గురించీ చర్చ నడుస్తోంది. సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ల కొత్త సినిమాలు ‘ఆచార్య’, ‘నారప్ప’ రిలీజ్ డేట్లను శుక్రవారమే ప్రకటించారు. ఈ రెండూ ఒక్క రోజు వ్యవధిలో బాక్సాఫీస్ పోరుకు సై అంటున్నాయి. దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
మరో సీనియర్ హీరో బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చే పరిస్థితుల్లో చిత్ర బృందం లేదని తెలుస్తోంది. లాక్ డౌన్ బ్రేక్ తర్వాత విరామం లేకుండా చిత్రీకరణ సాగుతోంది. సాధ్యమైనంత వేగంగా టాకీ పార్ట్ పూర్తి చేసి ఆ తర్వాత టీజర్ అప్‌డేట్, రిలీజ్ డేట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆ సినిమాకు కావాల్సినంత హైప్ కూడా ఉంది.
ఇక మిగతా స్టార్ హీరోల సినిమాలన్నీ వార్తల్లోనే ఉంటున్నాయి. అందరూ బిజీగా కనిపిస్తున్నారు కూడా. కానీ ఒక్క అక్కినేని నాగార్జున మాత్రం చాలా రోజుల నుంచి వార్తల్లో ఉండట్లేదు. ఆయన సినిమాల గురించీ చర్చ లేదు.
నాగ్ చివరగా చేసిన సినిమా ‘వైల్డ్ డాగ్’. దీని షూటింగ్ రెండు నెలల కిందటే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కావచ్చిందంటున్నారు. థియేటర్లు పున:ప్రారంభం అయినప్పటికీ ముందే చేసుకున్న డీల్ వల్ల ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. రిపబ్లిక్ డేకే ప్రిమియర్స్ అన్నారు. కానీ తర్వాత చప్పుడు లేదు. నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ లేదు. నాగ్ సైతం మౌనం వహిస్తున్నాడు. ఆ సినిమా టీజర్, ట్రైలర్, రిలీజ్.. ఇలా దేని గురించీ సమాచారం లేదు.
మిగతా హీరోల అభిమానులు కొత్త కొత్త అప్‌డేట్లతో సంబరాల్లో ఉంటే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం స్తబ్దుగా ఉన్నారు. అసలే నాగ్ కెరీర్ డల్లుగా నడుస్తుంటే.. కనీసం కొత్త సినిమాలను సరిగా ప్రమోట్ చేసుకుని జనాల చర్చల్లో ఉంచట్లేదన్న ఆవేదన అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా గురించి కానీ, ‘బంగార్రాజు’ గురించి కానీ నాగ్ ఏమీ మాట్లాడట్లేదు. వాటిని పట్టాలెక్కించట్లేదు. మరి ఈ టైంలో నాగ్ అసలేం చేస్తున్నాడా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on January 31, 2021 8:46 am
2025 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. నిన్న చెన్నైలో…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన చిరుత మూవీతో తెలుగు సినీ…
ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్…
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…