మెగాస్టార్ చిరంజీవి యమ స్పీడు మీదున్నాడు ఈ మధ్య. రీఎంట్రీలో రెండు సినిమాలు చేశాక.. ఆయన స్వల్ప వ్యవధిలో నాలుగు సినిమాలు ఖరారు చేశారు. అందులో ఒకటి.. ఆచార్య. అది పూర్తి కావస్తోంది. వేసవిలో విడుదలవుతోంది. దీని తర్వాత చిరు లూసిఫర్ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం రీమేక్‌లో నటిస్తాడు.
ఆపై కె.ఎస్.రవీంద్ర (బాబీ) లైన్లో ఉన్నాడు. అతడి స్క్రిప్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉంది. ఈ మధ్యే తాను పని చేయబోయే దర్శకుల్లో బాబీ కూడా ఉన్న సంగతి మరోసారి చిరు ధ్రువీకరించాడు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయడానికి చిరుకు అటు ఇటుగా ఏడాదిన్నర సమయం పట్టొచ్చు. ఆ తర్వాత.. అంటే 2022 ద్వితీయార్ధంలో చేయాల్సిన సినిమాకు కూడా చిరు పచ్చ జెండా ఊపాడన్నది తాజా సమాచారం.
ఇటీవలే క్రాక్‌తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేనిని చిరు తన దగ్గరికి పిలిపించుకుని మరీ అభినందించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అతడితో సినిమా చేయడానికి చిరు అంగీకారం తెలిపాడట. ఇదేదో మాట వరసకు అన్న మాట కాదని, నిజంగానే హామీ ఇచ్చాడని అంటున్నారు. గోపీచంద్ తన తర్వాతి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడన్నది టాక్. అ
లాగే క్రాక్ హిందీ రీమేక్‌కు కూడా అతనే దర్శకత్వం వహించనున్నాడట. కొంచెం ముందు వెనుకగా ఈ రెండు సినిమాలను అవగొట్టి.. ఆ తర్వాత చిరుతో చేయాల్సిన సినిమాకు స్క్రిప్టు పనిలో పడతాడట గోపీచంద్. 2022 ద్వితీయార్ధంలో, లేదా 2023 ఆరంభంలో కచ్చితంగా వీరి సినిమా పట్టాలెక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చిరుతో తన సినిమా ఓకే అయిందని గోపీచంద్ తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసింది.
This post was last modified on January 31, 2021 10:55 am
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…