ప్రదీప్ మాచిరాజు.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తెలుగులో బెస్ట్ మేల్ యాంకర్ ఎవరు అంటే మరో మాట లేకుండా అతడి పేరు చెప్పేస్తారందరూ. ‘గడసరి అత్త సొగసరి కోడలు’ అనే చిన్న కార్యక్రమంతో యాంకర్‌గా ప్రస్థానాన్ని ఆరంభించి.. తనదైన వాక్చాతుర్యంతో బోలెడన్ని షోలను నడిపిస్తూ టాలీవుడ్లో హైయెస్ట్ పెయిడ్ మేల్ యాంకర్ స్థాయికి ఎదిగాడతను. యాంకర్‌గా చేస్తూనే నటుడిగానూ సినిమాల్లో కొన్ని పాత్రలు చేసిన ప్రదీప్.. ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.
అతను కథానాయికగా పరిచయమవుతున్న సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. మున్నా అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో తమిళ అమ్మాయి అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. గత ఏడాది మార్చి 25నే రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.
మొత్తానికి పది నెలలు ఆలస్యంగా, బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేని సమయంలో ఈ శుక్రవారం థియేటర్లలోకి దిగుతోంది ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఏ ఓటీటీకో వెళ్లిపోకుండా ఇంతకాలం ఈ సినిమాను ఆపగలగడం గొప్ప విషయమే. హీరోగా ప్రదీప్ అరంగేట్రం వెండితెరపైనే జరగాలని పట్టుదలతో ఆగిన నిర్మాత అభినందనీయుడే. ఐతే ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందన్నది ఆసక్తికరం.
యూట్యూబ్‌ను ఊపేసిన ‘నీలి నీలి ఆకాశం..’ పాటతో ఈ సినిమా బాగానే జనాల నోళ్లలో నానింది చిత్ర బృందం కూడా ‘ఈ పాట అంత బాగుంటుందీ సినిమా’ అంటూ ప్రచారం చేసుకుంటోంది. ఐతే ఆ పాట నచ్చినంత మాత్రాన జనాలు థియేటర్లకు పరుగులు పెట్టేస్తారనేమీ లేదు. ప్రదీప్ కోసం కూడా ఎగబడేస్తారని అనుకోలేం. సినిమాలో విషయం ఉందంటే.. బాగుందన్న టాక్ వస్తే ఓ లుక్కేయడానికి ప్రేక్షకులు ఆలోచించరు. మరి శుక్రవారం ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో.. రివ్యూలెలా ఉంటాయో.. ప్రదీప్ హీరో అరంగేట్రంపై ఎవరేమంటారో చూడాలి.
This post was last modified on January 29, 2021 11:21 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…