సంక్రాంతిక కానుగా ఈ నెల 13న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది ‘మాస్టర్’ సినిమా. డివైడ్ టాక్‌ను గట్టుకుని ఈ చిత్రం మంచి ఓపెనింగ్సే తెచ్చుకుంది. తమిళనాడులో ఇంకా కూడా థియేటర్లలో బాగానే ఆడుతోంది. ఐతే రెండు వారాలు తిరిగేసరికి సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు సిద్ధపడటం, అందుకు హీరో విజయ్ కూడా మద్దతుగా నిలవడం డిస్ట్రిబ్యూటర్లకు మింగుడు పడటం లేదు.
ఈ విషయంలో తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని వ్యతిరేక స్వరాలు వినిపించాయి. ఇంత పెద్ద సినిమాను థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలో విడుదల చేస్తే ఇక థియేటర్ల వ్యవస్థ ఏం బతుకుతుందన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ చిత్ర నిర్మాతలు అవేమీ పట్టించుకోలేదు. అనుకున్నట్లే ఈ శుక్రవారం రాత్రి 10.15 గంటలకు ‘మాస్టర్’ను ప్రైమ్‌లో స్ట్రీమ్ చేసేయబోతున్నారు.
ఐతే భారీ రేట్లు పెట్టి ‘మాస్టర్’ను కొన్న తమ పరిస్థితి ఏంటని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ కారణంగా గతంతో పోలిస్తే ఆదాయం తగ్గిందని.. ఇలాంటి సమయంలో థియేటర్లలో బాగా ఆడుతున్న సినిమాను ఇంత త్వరగా ఓటీటీలో వదిలి తమ కడుపులు కొట్టడం అన్యాయమని వారంటున్నారు. తమ ఆదాయాన్ని దెబ్బ తీస్తున్నందుకు గాను ‘మాస్టర్’ నిర్మాతలు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా గ్రాస్ వసూళ్లలోంచి తమకు దక్కే షేర్‌లో పది శాతం అదనంగా ఇవ్వాలని, మాస్టర్ నిర్మాతల నిర్ణయం వల్ల తమ ఆదాయంలో కోత పడుతున్న మొత్తానికి ఇది పరిహారం అని వారు అంటున్నారు.
ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి నిర్మాతలకు మొర పెట్టుకున్నారు. ఐతే లాక్ డౌన్ టైంలో ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోసమని 50 పర్సంట్ ఆక్యుపెన్సీలో థియేటర్లలో రిలీజ్ చేశామని, డిస్ట్రిబ్యూటర్లకు కొంత తక్కువ మొత్తాలకే సినిమాను అమ్మామని, అలాంటపుడు త్వరగా ఓటీటీలో రిలీజ్ చేయడం ద్వారా కొంచెం ఎక్కువ రేటు దక్కుతున్న తమను ఇలా డిమాండ్ చేసి ఇబ్బంది పెట్టడం ఏంటని ‘మాస్టర్’ మేకర్స్ అంటున్నారు. ఈ గొడవపై ఏం తేలుతుందో ఏమో కానీ.. ‘మాస్టర్’ అయితే శుక్రవారం రాత్రి ప్రైమ్‌లోకి వచ్చేస్తోంది.
This post was last modified on January 29, 2021 11:21 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…