Movie News

‘నాకు నేను నచ్చలేదు’

ఒకప్పుడు ఒకే సమయంలో నారా రోహిత్ సినిమాలు తొమ్మిది దాకా లైన్లో ఉన్నాయి. అందులో కొన్ని చిత్రీకరణ పూర్తి చేసుకుంటే.. కొన్ని సెట్స్ మీద ఉన్నాయి. ఇంకొన్ని మొదలు కావాల్సి ఉంది. ఏడాదికి మూడు సినిమాల చొప్పున రిలీజ్ చేసుకుంటూ వెళ్లాడతను. అంత బిజీగా ఉన్న నటుడి నుంచి ఏడాదిన్నరగా ఒక్క సినిమా కూడా రాలేదు.

సినిమా రిలీజ్ సంగతలా ఉంచితే.. అసలు నారా రోహిత్ సినిమా ఏదీ షూటింగ్ కూడా జరుపుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ మధ్య ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరితో ఓ భారీ చిత్రం ప్రకటించాడు కానీ.. తర్వాత దాని ఊసు లేదు. అసలు రోహిత్ ఇండస్ట్రీలోనే కనిపించకపోవడానికి కారణాలేంటో అర్థం కాలేదు. ఐతే ఇటీవలే రోహిత్ ఓ కొత్త లుక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా అతను ట్విట్టర్లోకి కూడా అడుగుపెట్టాడు.

ఇన్నాళ్లు ఎందుకు అదృశ్యమైంది.. ఈ కొత్త లుక్ సంగతులేంటి చెబుతూ ఓ ఇంగ్లిష్ డైలీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు రోహిత్. తన సినిమాలు వరుసగా ఫెయిలవడం, అలాగే తన లుక్ తనకు నచ్చకపోవడం వల్లే ఈ గ్యాప్ తీసుకున్నట్లు రోహిత్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘ఒకప్పటి నా లుక్ నాకే నచ్చేది కాదు. అందుకే ఏడాది పాటు సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నాను. నా ఫిట్‌నెస్‌ విషయంలో రెండేళ్ల నుంచి ఎంతో కష్టపడుతున్నాను. అందుకే ఇప్పుడు ఈ లుక్ లోకి వచ్చాను. బరువు తగ్గి కొత్తగా తయారయ్యాను. లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే నా సినిమాలకు సంబంధించి రెండు పెద్ద ప్రకటనలు చేయబోతున్నాను. లాక్‌డౌన్‌ కారణంగా జిమ్‌ కు వెళ్లట్లేదు. ప్రతి రోజూ నేను ఇంట్లోనే వర్కౌట్లు చేస్తున్నాను. అలాగే డైట్‌ ఫాలో అవుతున్నాను. లాక్‌డౌన్‌ పూర్తయ్యేసరికి నేను మరింత ఫిట్‌ గా అవుతానని ఆశిస్తున్నాను’’ అని రోహిత్‌ చెప్పాడు.

This post was last modified on May 6, 2020 3:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

10 minutes ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

13 minutes ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

34 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago