Movie News

ఊపు ఊపేస్తున్న డాకు మహరాజ్

హిట్టు సినిమాల నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్‌ బిట్స్‌ సంగీత ప్రియులు యూట్యూబ్ వీడియోల నుంచి కట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఎలివేషన్లు వేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఐతే ఈ మధ్య సంగీత దర్శకులే ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను స్పెషల్‌గా రిలీజ్ చేయడం ట్రెండుగా మారింది. తమిళంలో అనిరుధ్ రవిచందర్, జి.వి.ప్రకాష్ కుమార్ ఈ ట్రెండుకు ఊపు తెచ్చారు.

తెలుగులో తమన్ కూడా అప్పుడప్పుడూ కొన్ని సినిమాలకు ఓఎస్‌టీ రిలీజ్ చేసి స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతున్నాడు. ఐతే అన్ని సినిమాల ఓఎస్‌టీ కోసం అభిమానులు ఎదురు చూడరు. కొన్ని సినిమాలు బీజీఎం విషయంలో బాగా ఇంప్రెస్ చేసి.. ఓఎస్‌టీ కోసం ఎదురు చూసేలా చేస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో ‘డాకు మహరాజ్’ ఒకటి.

గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘డాకు మహరాజ్’ నందమూరి బాలకృష్ణ సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ బీజీఎంతో బాలయ్య అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమా రిలీజైన 20 నెలల తర్వాత తమన్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను ఆన్ లైన్లో రిలీజ్ చేశాడు. దీని కోసం ఎప్పట్నుంచో బాలయ్య అభిమానుల నుంచి డిమాండ్ ఉండగా.. ఎట్టకేలకు తమన్ కంటెంట్ రిలీజ్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. 

ముఖ్యంగా ఇంటర్వెల్లో చిన్న పాపను కాపాడేందుకు డాకు తన పాత అవతారాన్ని బయటికి తీసే ఎపిసోడ్.. అలాగే అడవిలో వచ్చే ఫైట్.. ఫ్లాష్ బ్యాక్‌లో విలన్ ఇంటికి వెళ్లి హీరో విశ్వరూపం చూపించే ఎపిసోడ్… ఈ సన్నివేశాల్లో తమన్ బీజీఎం ఇచ్చే ఊపు మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సన్నివేశాల తాలూకు వీడియోలు పెట్టి అభిమానులు సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు తమన్ అధికారికంగా రిలీజ్ చేసిన సౌండ్ ట్రాక్స్‌తో మరోసారి ‘డాకు మహారాజ్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తమన్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ అంటూ నెటిజన్లు అతణ్ని కొనియాడుతున్నారు.

This post was last modified on November 16, 2026 6:50 pm

Share

Recent Posts

`నా ఓటును అమ్ముకోను`… బ్యాలెట్ బ్యాక్స్‌లో 500 నోట్లు-చీటీ!

ఎన్నిక‌లు ఏవైనా డ‌బ్బుల‌తోనే ముడి ప‌డి ఉంటున్నాయి. సొమ్ములు ఇచ్చి ఓట్లు వేయించుకునేందుకు నాయ‌కులు, తీసుకునేందుకు ఓట‌ర్లు కూడా ఎక్క‌డా…

13 minutes ago

మెగా ఫ్యామిలీలో కొత్త ‘కుంపటి’

టాలీవుడ్లో చాలామంది హీరోలకు సొంత బేనర్లు ఉన్నాయి. తమ కుటుంబ సభ్యులనో, దగ్గరి మిత్రులనో పెట్టి ఆ బేనర్లను నడిపిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే…

29 minutes ago

నాగార్జున రూటులో శివరాజ్ కుమార్

శాండల్ వుడ్ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇంతకు ముందు మన ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు…

1 hour ago

ఈ సారి కాంగ్రెస్ ను ఓడించగలిగేది అదేనా?

2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి గెలుపు తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు…

2 hours ago

సవాళ్లకు సిద్ధమవుతున్న వారణాసి

వారణాసి అప్డేట్స్ కావాలని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్న వైనం ఈ మధ్య పెరిగింది. ఏప్రిల్…

2 hours ago

ఒక వీడియోతో బుడ్డోడికి లైఫ్ టైం సెటిల్మెంట్

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. కొన్నిసార్లు సెలబ్రిటీలకు కూడా సాధ్యం కాని…

4 hours ago