రామాయణం సినిమా రిలీజ్ ముంగిట ఎటు చూసినా నెగెటివ్ వార్తలే కనిపించేవి. రూ.4 వేల కోట్ల బడ్జెట్ సహా ఆ సినిమా విశేషాల గురించి టీం చెబుతుంటే.. అనుమానంగా చూశారు జనాలు. అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడం గురించి మేకర్స్ మాట్లాడుతుంటే.. ముందు ఇండియన్ ఆడియన్స్‌ను మెప్పించండంటూ కౌంటర్లు వేశారు చాలామంది.
కానీ ఈ సినిమా ఇప్పుడు దేశీయ ప్రేక్షకులనే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను కూడా గొప్పగా మెప్పిస్తోంది. గ్లోబల్ లెవెల్లో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ‘రామాయణం’ ప్రభంజనం సృష్టిస్తోందనే చెప్పాలి. అక్కడ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా ‘రామాయణం’ రికార్డు నెలకొల్పబోతుండడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ చిత్రం 15 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. వారం తిరక్కముందే ఈ ఘనత సాధించడం అంటే మాటలు కాదు.
నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ మూవీగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘దురంధర్-2’ సినిమా రికార్డు నెలకొల్పింది. మార్చి 19న రిలీజైన ఆ చిత్రం ఫుల్ రన్లో 28.6 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. అంతకుముందు రికార్డు బాహుబలి (22 మిలియన్ డాలర్లు) పేరిట ఉండేది. తొమ్మిదేళ్ల పాటు ఉన్న రికార్డును దురంధర్-2 బద్దలు కొట్టగా.. దాని రికార్డును ఏడెనిమిది నెలలకే ‘రామాయణం’ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా ప్రతి రోజూ మిలియన్ డాలర్లకు తక్కువ కాకుండా వసూళ్లు రాబడుతోంది.
వీక్ డేస్‌లో కూడా సినిమా జోరు తగ్గడం లేదు. మంగళవారం కూడా ఒకటిన్నర మిలియన్లకు పైగానే వసూళ్లు దక్కించుకుంది. ఈ వీకెండ్ కూడా ‘రామాయణం’కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం ఈజీగా 30 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ పండిట్ల అంచనా. అంతకుమించి ముందుకు వెళ్లినా కూడా ఆశ్చర్యం లేదంటున్నారు. ఐతే ‘రామాయణం’ రికార్డు కూడా ఎక్కువ కాలం నిలవకపోవచ్చని అంచనా. వచ్చే ఏడాది వేసవిలో ‘వారణాసి’ వస్తే.. ఈ రికార్డు కూడా బద్దలైపోతుందేమో.
This post was last modified on November 11, 2026 10:28 pm
రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం…
ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణం అంటేనే రద్దీ, హడావుడి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్లలో ఎక్కడం, దిగడం ప్రయాణికులకు…
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ…
హీరో రోషన్ మేక, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో కొత్త సినిమా మొదలయ్యింది. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు…
ఇటీవలే విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47తో రికార్డులు బద్దలు కొడతారనుకుంటే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రంగా నిరాశ పరచడం…
థియేటర్ల నుంచి వెళ్ళిపోయి ఓటిటిలో వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్ బారిన పడిన ది ప్యారడైజ్ ఇప్పుడప్పుడే సోషల్ మీడియా నుంచి…