రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపగా.. ఈ క్రమంలోనే తుమ్మిడికుంట చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
నాగార్జునను కావాలనే రేవంత్ టార్గెట్ చేశారంటూ ఓ వర్గం విమర్శలు చేస్తే.. ప్రభుత్వం సరైన పనే చేసిందంటూ మరో వర్గం వాదించింది. కూల్చివేత జరిగిన తొలినాళ్లలో నాగ్ కూడా ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తిగా కనిపించారు. అయితే తర్వాత ఈ వ్యవహారం క్రమంగా సద్దుమణిగింది. అంతేకాకుండా ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాలకు నాగార్జున తన మద్దతు ప్రకటించడం కూడా ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు అదే తుమ్మిడికుంట చెరువు మరోసారి వార్తల్లో నిలిచింది. ఎన్ కన్వెన్షన్‌తో పాటు చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలను తొలగించిన ప్రభుత్వం.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసింది. గతంలో సుమారు 15 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువును ఇప్పుడు 30 ఎకరాలకు పైగా విస్తరించింది. చెరువులోకి నీళ్లు చేరడంతో పాటు చుట్టూ పార్క్, జిమ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించింది.
ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రారంభోత్సవ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇబ్బందిపడ్డ వ్యక్తిగా వార్తల్లో నిలిచిన నాగ్.. ఇప్పుడు అదే ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ కార్యక్రమానికి నాగార్జున అందించిన మద్దతును ప్రశంసించారు. ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలకు నాగ్ సహకరించడాన్ని అభినందించారు. నాగర్జున సినిమా హీరో మాత్రమే కాదు, నిజమైన జీవితంలో కూడా ఒక హీరోలా నిర్ణయం తీసుకున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. ఒకప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన వివాదం.. ఇప్పుడు అదే చెరువు అభివృద్ధి కార్యక్రమంలో నాగ్, రేవంత్ ఒకే వేదికను పంచుకోవడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on November 11, 2026 10:41 pm
రామాయణం సినిమా రిలీజ్ ముంగిట ఎటు చూసినా నెగెటివ్ వార్తలే కనిపించేవి. రూ.4 వేల కోట్ల బడ్జెట్ సహా ఆ…
ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణం అంటేనే రద్దీ, హడావుడి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్లలో ఎక్కడం, దిగడం ప్రయాణికులకు…
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ…
హీరో రోషన్ మేక, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో కొత్త సినిమా మొదలయ్యింది. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు…
ఇటీవలే విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47తో రికార్డులు బద్దలు కొడతారనుకుంటే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రంగా నిరాశ పరచడం…
థియేటర్ల నుంచి వెళ్ళిపోయి ఓటిటిలో వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్ బారిన పడిన ది ప్యారడైజ్ ఇప్పుడప్పుడే సోషల్ మీడియా నుంచి…