సౌత్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్.. కొన్నేళ్ల కిందట ఇటలీ మ్యుజీషియన్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అతను అప్పట్లో చెన్నైకి రావడం.. శ్రుతి, ఆమె తండ్రి కమల్‌తో కలిసి సంప్రదాయ దుస్తుల్లో ఒక వేడుకలో కూడా పాల్గొనడం తెలిసిందే. ఇక వీళ్లిద్దరి పెళ్లే తరువాయి అనుకుంటుండగా.. అనూహ్యంగా ఆ బంధానికి తెరపడింది. ఇద్దరూ విడిపోయి ఎవరి దారుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. శ్రుతి మళ్లీ సినిమాల్లో బిజీ అయింది.
ఐతే తాజాగా అభిమానులతో ఓ చిట్ చాట్ సందర్భంగా శ్రుతి.. మాజీ ప్రియుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీరు మీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ను ద్వేషిస్తున్నారా అని అడిగితే.. “నువ్వు చాలా చెడ్డ వాడిలా ఉన్నావ్. నేను నా జీవితంలో ఎవరినీ ద్వేషించను. అలా జరగదు. కానీ ఆ విషయంలో కొంచెం బాధ ఉంది” అని బదులిచ్చింది.
మరోవైపు తన ముఖానికి జరిగిన ప్లాస్టిక్ సర్జరీ గురించి ఓ అభిమాని అడిగితే.. అది జరిగి 11 ఏళ్లు అవుతోందని.. ఇంకా దాని గురించి మాట్లాడటం అవసరమా అని ప్రశ్నించింది శ్రుతి హాసన్. మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారటగా అని అడిగితే అలాంటిదేమీ లేదని.. ఇప్పుడిప్పుడే పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితి లేదని ఆమె తేల్చి చెప్పింది.
మీరు ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డారా అని అడిగితే.. నిజమేనేమో అంటూ బదులిచ్చి ఊహాగానాలకు తావిచ్చింది శ్రుతి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిన శ్రుతికి.. తెలుగులో క్రాక్ మూవీతో అదిరిపోయే రీఎంట్రీ దక్కింది. తమిళంలో ఆమె లాభం సహా మరో సినిమాలో నటిస్తోంది.
This post was last modified on January 25, 2021 10:55 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…