మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో గ్యాంగ్ లీడర్ ఒకటి. ఆయన కెరీర్లో ఆ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు చూసినా ఎంగేజింగ్‌గా ఉండి.. ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే లక్షణాలున్న చిత్రమిది. లుక్, యాక్టింగ్, గ్రేస్, డ్యాన్స్‌లు, ఫైట్లు.. ఇలా ఏది చూసుకున్నా మెగాస్టార్ ది బెస్ట్ అన్నట్లు కనిపిస్తారా చిత్రంలో.
హీరో ఎలివేషన్లకు తోడు ఫ్యామిలీ సెంటిమెంట్ బ్రహ్మాండంగా పండిన చిత్రమిది. ఈ సినిమాలో చిరు సోదరులుగా మురళీ మోహన్, శరత్ కుమార్ గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. సినిమాలో చూస్తున్నపుడు ఈ ముగ్గురూ నిజంగా అన్నదమ్ములా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగా వారి కెమిస్ట్రీ కుదిరింది సినిమాలో.
ఇంకో రెండు నెలల్లో గ్యాంగ్ లీడర్ 30వ వార్షికోత్సవం జరుపుకోనుండగా.. ఈ ముగ్గురు రీల్ బ్రదర్స్ అనుకోకుండా కలవడం విశేషం. రామోజీ ఫిలిం సిటీలో చిరు ఆచార్య సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా.. మురళీ మోహన్ ఆర్కా మీడియా వాళ్లు తీస్తున్న కొత్త సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అదే సమయంలో శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ షూటింగ్ కోసం ఫిలిం సిటీకి వచ్చారు.
ఈ సంగతి ముగ్గురికీ తెలిసి ఒక చోట కలిశారు. చిరునే ఫొటో దిగుదాం అని చెప్పడంతో ముగ్గురూ కలిసి పోజులిచ్చారు. ఇప్పుడా ఫొటో ఒకవైపు, గ్యాంగ్ లీడర్ చిత్రంలో ముగ్గురూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేసే దృశ్యాన్ని ఒక వైపు పెట్టి 30 ఏళ్ల తర్వాత కలిసి గ్యాంగ్ లీడర్ బ్రదర్స్ అంటూ క్యాప్షన్లు పెడుతున్నారు మెగా అభిమానులు.
This post was last modified on January 25, 2021 9:18 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…