కొన్నేళ్లుగా తమిళనాట విజయ్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది. టాక్‌తో సంబందం లేకుండా అతడి సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. మెర్సల్ సినిమాకు మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. అది చాలాసార్లు చూసిన కమర్షియల్ సినిమాల రీహ్యాష్ లాగే ఉంటుంది. ఆ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
సర్కార్ సైతం భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక చివరగా అతడి నుంచి వచ్చిన బిగిల్ సైతం రొటీన్ సినిమానే అయినా.. వసూళ్లకు ఢోకా లేకపోయింది. ఇప్పుడు బాక్సాఫీస్‌కు అత్యంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సమయంలో విడుదలైన అతడి కొత్త చిత్రం మాస్టర్ సాధిస్తున్న వసూళ్లు ఔరా అనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఈ చిత్ర గ్రాస్ వసూళ్లు రూ.200 కోట్ల మార్కును టచ్ చేసినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.
ఒక్క తమిళనాడులో మాత్రమే మాస్టర్ రూ.100 కోట్ల మార్కును ఆల్రెడీ దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. ఇక మలయాళంలో విజయ్ సినిమాలు తమిళనాడు తరహాలోనే ఆడతాయి. అక్కడ గ్రాస్ భారీగానే వచ్చింది. కర్ణాటకలోనూ ఈ సినిమా జోరు కొనసాగుతోంది. ఉత్తరాదిన సైతం మాస్టర్ డబ్బింగ్ వెర్షన్‌ను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు.
కరోనా విరామం తర్వాత విదేశాల్లో అత్యంత భారీగా విడుదలైన చిత్రం ఇదే. అన్ని చోట్లా టాక్‌తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న సమయంలో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఓ ప్రాంతీయ చిత్రానికి రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లంటే సామాన్యమైన విషయం కాదు. విజయ్ ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగిపోయాడో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే విజయ్ జోరు ఇంకెలా ఉండేదో?
This post was last modified on January 24, 2021 10:40 pm
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…