Political News

ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి పొలిటికల్ స్కెచ్

తెలంగాణాలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చడంలో సఫలం అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రధానంగా ఆయన మీదే వుంది. ఈ విషయం తెలిసిన నాయకుడు కనుకనే ఎన్నికల పోరాటానికి ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ప్రజాబలం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం రెడీ అయ్యింది. తెలంగాణాలోని ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగేలా ప్లాన్ చేసుకున్నారు. కొడంగల్ పర్యటనలో ఆయన ప్రజాబలం గురించి మాట్లాడారు.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీమ్ పేటలో జరిగిన సోమవారం రాత్రి జరిగిన రైతన్న ఆత్మీయ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత దుధ్యాల మండలం పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు దూరంలో వున్న రైతన్న ఆత్మీయసభ వేదిక వరకు పాదయాత్రగా వెళ్లారు. గంటన్నరకు పైగా కొనసాగిన ఈ పాదయాత్రలో దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు.

మాట్లాడిన రేవంత్ రెడ్డి తన దైన శైలిలో విపక్షాల మీద విరుచుకొని పడ్డారు. ప్రజాబలంతో రాష్ట్రంలో సునామీ సృష్టిస్తానని చెప్పిన ఆయన ఈ సునామీలో ప్రధాన మంత్రి మోదీ కొట్టుకొని పోతారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేసుకుంటున్నారని, వారికి చుక్కలు చూపిస్తానంటూ వ్యాఖ్యనించారు. తెలంగాణా వచ్చినా, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా పాలమూరు ప్రజలకు కేసీఆర్ న్యాయం చేయలేదని, అలాంటి నాయకుడి అవసరం వుందా అని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో 8.11 లక్షల కోట్ల అప్పులు చేసి ఫాంహౌస్ లో తలదాచుకున్నాడని ఎద్దేవా చేశారు.

కొడంగల్ ప్రజలు అండగా వుంటే ఢిల్లీనైనా ఎదిరిస్తా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి నాకు అప్పులు చేసే అలవాటు, అబద్దాలు చెప్పే వ్యక్తిత్వం లేదన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 9 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తే బీఆర్ఎస్ నాయకులు ఏడుస్తున్నారని విమర్శించారు. మీ సొమ్ము ఏమైనా గుంజుకున్నామా? మీ ఆస్తులు లాక్కున్నామా? మరి ఎందుకు ఏడుస్తున్నారో చెప్పమని వ్యంగంగా ప్రశ్నించారు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, మీరెన్ని ఆడుపుల్లలు వేసినా తెలంగాణా అభివృద్ధి ఆగదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 కు పైగా స్థానాల్లో విజయం సాధించి రాహుల్ గాంధీకి బహుమతి ఇస్తామని ప్రకటించారు.

This post was last modified on November 10, 2026 11:00 am

Share

Recent Posts

సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టం: నాగార్జున

ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడం తాము అదృష్టవంతులమని సీనియర్ హీరో అక్కినేని నాగార్జున అన్నాడు. ‘ఇట్లు అర్జున’ సినిమాతో హీరోగా…

25 minutes ago

తన పార్టీ ఏదో చెప్పేసిన జగపతి

తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వారిలో కొందరు నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెడితే.. మిగతా…

2 hours ago

ముందే బరువు తగ్గాల్సింది – ఎన్టీఆర్

కెరీర్ ఆరంభంలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండేదో అభిమానులకు గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్లో హీరోలు మెయింటైన్ చేసే స్టాండర్డ్స్‌తో…

4 hours ago

‘పార్టీని నాశనం చేస్తున్న అవినాష్ రెడ్డి’

కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని ఓ  సామాన్య కార్యకర్త జగన్ కు లేఖ రాయడం…

4 hours ago

జ‌గ‌న్ చేయ‌లేన‌న్నారు… బాబు చేసి చూపించారు!

ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.. పింఛ‌ను విధానం. 2004 సెప్టెంబరులోను.. ఆ త‌ర్వాత‌ ఉద్యోగాల్లో చేరిన వారికి…

4 hours ago

టపాసులు కాలిస్తే రోగాలు పోతాయా?

దీపావళి అంటే దీపాల వెలుగులు, కుటుంబ సభ్యుల సందడి, మిఠాయిలు, బాణసంచా హడావుడి గుర్తుకొస్తాయి. పండుగ వేళ టపాసులు కాల్చడం…

4 hours ago