సూర్య స్ట్రాటజీ భలే పని చేసింది

ఈ ఏడాది ‘కరుప్పు’ (వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో మూడు నెలల వ్యవధిలో రెండు బ్లాక్ బస్టర్లు కొట్టాడు సూర్య. ఇంకో మూడు నెలలకే ‘సీన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇంత పెద్ద స్టార్ నుంచి 6 నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ కావడమే ఆశ్చర్యమంటే.. ఈ మూడూ బ్లాక్ బస్టర్లు కావడం మరింత విశేషం. ఐతే వీటిలో ‘సీన్’ సినిమాకు రిలీజ్ ముంగిట ఏమంత హైప్ లేదు.

ఇది రెగ్యులర్ మాస్ మసాలా సినిమా కాకపోవడంతో టీజర్లు కొంచెం డిఫరెంట్‌గానే కట్ చేశారు మేకర్స్. దీనికి తోడు పబ్లిసిటీ కూడా పెద్దగా చేయలేదు టీం. తెలుగులో అయితే ఏమాత్రం బజ్ క్రియేట్ కాలేదు. ‘రామాయణం’ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేయడం.. ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి చాలా థియేటర్లను హోల్డ్ చేయడంతో స్క్రీన్లు బాగా తక్కువే మిగిలాయి ఈ చిత్రానికి.

రెండు బ్లాక్ బస్టర్ల తర్వాత సూర్య నుంచి వచ్చిన సినిమాకు ఇంత లోబజ్, నామమాత్రపు రిలీజ్ దక్కడం ఆశ్చర్యమే. మరోవైపు తమిళంలో కూడా సూర్య మునుపటి చిత్రాలతో పోలిస్తే ‘సీన్’కు హైప్ తక్కువగానే కనిపించింది. కానీ రిలీజ్ తర్వాత ఈ సినిమా వైల్డ్ ఫైరే అయింది. తెలుగులో ఈ సినిమాకు యావరేజ్ టాకే రాగా.. తమిళంలో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టిన తమిళులు ‘సీన్’ను మాత్రం బాగా ఓన్ చేసుకున్నారు. తెలుగులో వచ్చిన టాక్‌తోనే ‘సీన్’ కొంచెం గట్టిగానే నిలబడింది. తమిళనాడు, కేరళల్లో మాత్రం సినిమా వీకెండ్లో దుమ్ము దులిపేసింది. రెండు చోట్లా హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది.

మొత్తంగా ‘సీన్’ సూర్యకు హ్యాటిక్ బ్లాక్ బస్టర్ అని కన్ఫమ్ అయిపోయింది. ఈ సినిమాకు ఎక్కువ ప్రమోషన్లు చేయకుండా.. హైప్ పెంచే ప్రోమోలు కట్ చేయకుండా.. సూర్య అండ్ టీం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లే కనిపిస్తోంది. వీలైనంత మేర ప్రేక్షకులు అంచనాలు తగ్గించుకుని వచ్చేలా చేసింది. ఇక థియేటర్లలోకి అడుగుపెట్టాక వారి అంచనాలకు మించి సినిమా ఉండడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. రిలీజ్ ముంగిట మరీ హైప్ ఎక్కించి ఉంటే సినిమా ఫలితం వేరుగా ఉండేదేమో.