Movie News

మహా శివరాత్రికి మ్యాడ్ రష్


ఫిబ్రవరి, మధ్య నుంచి మార్చి మధ్య వరకు అన్ సీజన్‌గా భావిస్తారు మామూలు. ఈ టైంలో పేరున్న సినిమాలు రిలీజ్ కావు. చిన్నా చితకా సినిమాలలను లాగించేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అన్ సీజన్లోనే సినిమాల మోత చూడబోతున్నాం. అలాగని అవేమీ చిన్నా చితకా సినిమాలు కావు. మీడియం రేంజ్, క్రేజ్ ఉన్న సినిమాలే.

నితిన్-చంద్రశేఖర్ యేలేటిల కలయికలో తెరకెక్కిన ‘క్రాక్’ ఫిబ్రవరి 19న రాబోతుండగా.. మార్చి 11న మహా శివరాత్రి కానుకగా శర్వానంద్ సినిమా ‘శ్రీకారం’ విుడదల ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన కొన్ని గంటలకే మరో చిత్రం మహా శివరాత్రి రేసులోకి వచ్చేసింది. స్వప్న సినిమా పతాకంపై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ కూడా అదే రోజుకు రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు.

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామృష్ణ లాంటి మంచి కామెడీ టచ్ ఉన్న నటులు కలిసి నటించిన ఈ చిత్రాన్ని ‘పిట్టగోడ’ ఫేమ్ అనుదీప్ రూపొందించాడు. దీని ప్రోమోలన్నీ ప్రేక్షకుల దృష్టిన ిఆకర్షించాయి. ఒక ఆసక్తికర ప్రోమోతో.. ‘‘ఇంట్లో కాదు.. థియేటర్లలో చూసుకుందాం రండి. నవ్వుకుందాం’’ అనే ఫన్నీ క్యాప్షన్‌తో రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం.

మరోవైపు మహాశివరాత్రికి ఇంకో సినిమా కూడా రాబోతున్నట్లు సమాచారం. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్టుతో ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ రూపొందించిన ‘గాలి సంపత్’ సైతం శివరాత్రి కానుకగా మార్చి 11నే వస్తుందట. రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 11న రిలీజ్ అని డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వెళ్లిపోయింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్నారట. గత ఏడాది మార్చి రెండో వారంలో ‘మధ’ అనే చిన్న సినిమా ఒక్కటే విడుదలైంది.

2020 అనే కాదు.. ఎప్పుడూ కూడా మార్చి రెండో వారంలో పేరు లేని సినిమాలే వస్తుంటాయి. అలాంటిది ఈసారి మహా శివరాత్రి పండుగ వచ్చేసరికి మూడు సినిమాలు విడుదలకు సిద్ధమైపోయాయి. వేసవిలో అస్సలు ఖాళీ లేకపోవడం, విడుదల కోసం చాలా చిత్రాలు ఎదురు చూస్తుండటంతో అన్ సీజన్లో కూడా మ్యాడ్ రష్ చూడబోతున్నామన్న మాట.

This post was last modified on January 24, 2021 6:07 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

4 minutes ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

46 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

1 hour ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

2 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

2 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

3 hours ago