ఈ రోజుల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా రెండో వీకెండ్ దాటాక నిలబడ్డం కష్టమే. లాంగ్ రన్ అన్నది చాలా చాలా కష్టం ఇప్పుడు. ఐతే కొన్ని సినిమాలకు మాత్రం పరిస్థితులు భలేగా కలిసొచ్చేసి రెండో వారం తర్వాత కూడా జోరు చూపిస్తుంటాయి. సంక్రాంతి సినిమా ‘క్రాక్’ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రం మూడో వీకెండ్లో ఉంది.
ఐతే ‘క్రాక్’కు వస్తున్న కలెక్షన్లు, థియేటర్ల దగ్గర సందడి చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. సంక్రాంతికి విడుదలైన మిగతా మూడు చిత్రాలు బాగా జోరు తగ్గించేయగా.. ‘క్రాక్’ తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. నిన్న శనివారం ‘క్రాక్’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్యాక్డ్ హౌసెస్‌తో నడిచింది. ప్రధాన సెంటర్లన్నింట్లోనూ ఫస్ట్ షోలు ఫుల్స్ పడ్డాయి. టికెట్లు దొరక్క ప్రేక్షకులు నిరాశ చెందే పరిస్థితి కనిపించింది.
మల్టీప్లెక్సుల్లో ముందు షెడ్యూల్ అయిన షోలు సరిపోక అదనపు షోలు వేయాల్సి వచ్చింది. బుకింగ్స్‌ను బట్టి అన్ని మల్టీప్లెక్సులూ షోలు పెంచుకుంటూ పోయాయి. అసలే 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తుండటంతో స్క్రీన్లు, షోలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. మూడో వీకెండ్లో ‘క్రాక్’ ఇంత జోరు చూపిస్తుండటం ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోవిడ్ ప్రభావం కొనసాగుతుండగా, 50 పర్సంట్ ఆక్యుపెన్సీలో ఎన్నో అనుమానాల మధ్య ఈ సినిమాను రిలీజ్ చేయగా.. తొలి రోజు విడుదల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిసిందే.
దీనికి తోడు సంక్రాంతికి ఇంకో మూడు సినిమాలు పోటీలో ఉన్న నేపథ్యంలో ‘క్రాక్’ నిర్మాత, బయ్యర్లకు గట్టి దెబ్బ తప్పదని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం అంచనాల్ని తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూ సాగుతోంది. ఆదివారం సెకండ్ షోలు అయ్యేసరికి ఈ చిత్రం రూ.30 కోట్ల షేర్ మార్కును టచ్ చేసే అవకాశముంది.
This post was last modified on January 24, 2021 2:29 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…