Movie News

శర్వానంద్‌ ఎందుకు ఆగాల్సి వచ్చింది

నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి వాయిదా పడటం వెనుక సెన్సార్ ఆలస్యమని, రివైజింగ్ కమిటీకి వెళ్లడం వల్లే సకాలంలో సర్టిఫికెట్ రావడం లేటవుతోందని, అందుకే పోస్ట్ పోన్ తప్ప వేరే మార్గం లేకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నారని ఇప్పటిదాకా ఉన్న సమాచారం. అయితే అధికారులకు అంత అబ్జెక్షన్ అనిపించినవి, ఏ సర్టిఫికెట్ వద్దనుకోవడం వెనుక నిర్మాతల స్ట్రాటజీ ఏంటనే దాని మీద పలు కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైంది సినిమాలో ఉన్న  బ్యాక్ డ్రాప్.

భోగి కల్పించి రాసుకున్న కథే అయినప్పటికీ దర్శకుడు సంపత్ నంది చాలా బోల్డ్ గా, వయొలెంట్ గా తెరకెక్కించారని ఇన్ సైడ్ టాక్. పలు కులాల ప్రస్తావన ఇందులో ఉందట. కొన్ని పేర్లు నేరుగా మరికొన్ని పరోక్షంగా పెట్టడం వల్ల మనోభావాలు దెబ్బ తినే ప్రమాదం ఉందని గుర్తించి సెన్సార్ ఈ విషయంలో పలు కత్తిరింపులు, సూచనలు చేయడం వల్లే రిలీజ్ డేట్ మిస్సయ్యిందని అంటున్నారు. ప్యారడైజ్, కొరియన్ కనకరాజు, కామ్రేడ్ కళ్యాణ్ లాంటివి ఇదే సమస్యని ఎదురుకున్నాయి.

ఒకవేళ మూడు నాలుగు రోజుల్లో కనక పరిష్కారం దొరికితే వచ్చే వారం రిలీజ్ జరగొచ్చు లేదా నెలాఖరుకి వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే డిసెంబర్ నాలుగున నాగచైతన్య వృషకర్మ ఉన్న నేపథ్యంలో భోగి ఇంకొంచెం ముందుగా రావడం వల్ల కమర్షియల్ గా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. నవంబర్ 19 ఈ నగరానికి ఏమైంది 2 లాంటి క్రేజీ సినిమాలున్నాయి కానీ భోగి లాగా ఊర మాస్ మూవీ వేరేది లేదు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునే అవకాశాన్ని ఏ మేరకు వాడుకుంటారో చూడాలి.

అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటించిన భోగిలో సిస్టర్ సెంటిమెంట్ బలంగా దట్టించారు సంపత్ నంది. కథలో కీలక మలుపులు, రివెంజ్ డ్రామా ఈ పాత్రల చుట్టూ ఉంటుందని వినికిడి. శర్వానంద్ ని ఇంతకు ముందు చూడని మేకోవర్ లో చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తున్నారు. దశాబ్దాల వెనుక జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని సంపత్ నంది చాలా ఇంటెన్స్ గా భోగిని రూపొందించారట. ఇది వచ్చిన రెండు నెలలకే శర్వా మరోసారి జార్జ్ క్రిష్ గా రాబోతున్నాడు.

This post was last modified on November 9, 2026 9:44 pm

Share

Recent Posts

వియత్నాం ఎయిర్‌పోర్టులో మన పరువు తీశారుగా!

విదేశాలకు వెళ్లడం అంటే కేవలం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఫొటోలు దిగడం, అక్కడి అందాలను ఆస్వాదించడం మాత్రమే కాదు. మన…

2 minutes ago

అంతా మనోళ్లే.. అయినా ఓటమి ఎలా? బాబు సీరియస్

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పని రాక్షసుడిగా పేరున్న విషయం తెలిసిందే. ఏదైనా అనుకుంటే ఆ పని పూర్తి చేసేవరకు వొదిలిపెట్టారని ఆయనను…

37 minutes ago

సమ్మర్ ఎందుకింత ట్రిగ్గర్ అయ్యింది

ఈ మధ్య కలెక్షన్ల కన్నా ఎక్కువగా సోషల్ మీడియా కామెంట్లు అందుకున్న సినిమాల్లో సమ్మర్ హాలిడేస్ ఒకటి. చిన్న పిల్లలను…

47 minutes ago

సూర్య స్ట్రాటజీ భలే పని చేసింది

ఈ ఏడాది ‘కరుప్పు’ (వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో మూడు నెలల వ్యవధిలో రెండు బ్లాక్ బస్టర్లు కొట్టాడు…

2 hours ago

సర్పంచ్ అంటే ఇలా ఆలోచించాలి

నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చదువులు, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం యువత పట్టణాలు,…

5 hours ago

అర్జునుడి వెనుక ఇంత మంది పాండవులా

కొత్త హీరో నటించిన సినిమా అంటే జనాల్లో అంత సులభంగా అటెన్షన్ రాదు. ప్రమోషన్లు బలంగా చేసినా ఏదో ఒక…

7 hours ago