తెలుగు సినిమా చరిత్రలో కామెడీ అనే అధ్యాయంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. తన గురువు జంధ్యాలకు దీటుగా ఆయన కామెడీ పండించారు. కెరీర్లో ఎక్కువగా ఆ జానర్లోనే సినిమాలు తీశారు. ప్రపంచంలోనే మరే ఇండస్ట్రీలో లేని విధంగా తెలుగు పరిశ్రమ ఒక సమయంలో పదుల సంఖ్యలో కమెడియన్లతో కళకళలాడిందంటే అందులో ఈవీవీ పాత్ర కూడా కీలకం.
ఆయన సినిమాల్లో ఎప్పుడూ రెండంకెల సంఖ్యలో కమెడియన్లు ఉండేవాళ్లు. వాళ్లందరికీ మంచి పాత్రలుండేవి. కామెడీ డోస్ ఓ రేంజిలో ఉండేది. తన కొడుకు అల్లరి నరేష్‌కు కూడా కామెడీ సినిమాలతో ఎన్నో హిట్లు ఇచ్చాడు ఈవీవీ. ఆయన చనిపోయి ఈ జనవరి 21 నాటికి పదేళ్లు పూర్తయింది. టీవీల్లో ఆయన సినిమాలు వచ్చినపుడల్లా ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుని ఈవీవీ చాలా త్వరగా వెళ్లిపోయారే అనుకుంటూ ఉంటారు.
ఇక ఈవీవీ లేని లోటు మరింతగా కనిపించేది ఆయన తనయుడు నరేష్ సినిమాలు చూసినపుడే. తండ్రి వెళ్లిపోయిన తర్వాతి ఏడాది నుంచే నరేష్ కెరీర్ గాడి తప్పింది. సుడిగాడు మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్లు కరవయ్యాయి. ఈవీవీ ఉండగా.. మధ్య మధ్యలో నరేష్‌కు ఫ్లాపులు వచ్చినా ఆయన వెంటనే చెయ్యిచ్చి ఆదుకునేవారు. మంచి కామెడీ సినిమాతో అతణ్ని ట్రాక్‌లోకి తెచ్చేవారు. ఆయన మరణానంతరం నరేష్ కెరీర్‌ను గాడిన పెట్టేవాళ్లే లేకపోయారు. అతను ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు.
తాజాగా నరేష్ నుంచి బంగారు బుల్లోడు సినిమా వచ్చింది. ఇది కూడా ప్రేక్షకుల తిరస్కారానికి గురైనట్లే కనిపిస్తోంది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ గతంలో నరేష్‌తో ఈవీవీ చేసిన రూరల్ కామెడీ సినిమాలే గుర్తుకొచ్చి ఉంటాయి ప్రేక్షకులకు. ఇదే కథ ఈవీవీ చేతిలో పడితే.. తన మార్కు వెటకారాన్ని, హాస్యాన్ని జోడించి పాస్ మార్కులతో బయటపడేసేవాడేమో అనిపిస్తుంది. పాపం నరేష్‌కు తండ్రి లేని లోటు ఇప్పటికీ ఇలా కొనసాగుతుండటం విచారకరం.
This post was last modified on January 24, 2021 11:26 am
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…