బాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేసే స్టార్ హీరో అక్షయ్ కుమార్. గత కొన్నేళ్లలో కరోనా మాత్రమే ఆయన జోరుకు అడ్డుకట్ట వేసింది. మిగతా టైం అంతా తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఎంత స్పీడుగా సినిమాలు చేసినా.. క్వాలిటీ మెయింటైన్ చేయడం అక్షయ్‌కే చెల్లింది. గత ఏడాది కరోనా లేకుంటే అక్షయ్ సినిమాలు కనీసం మూడైనా రిలీజయ్యేవి. ఆ మహమ్మారి కారణంగా లక్ష్మి సినిమా మాత్రమే, అది కూడా ఓటీటీలో రిలీజైంది.
కరోనా బ్రేక్ వేయడానికి ముందు విడుదలకు రంగం సిద్ధం చేసుకున్న అక్షయ్ సినిమా సూర్యవంశీకి పెద్ద షాక్ తగిలింది. థియేటర్లు మూతపడటంతో ఎంతకీ ఆ సినిమా విడుదలే కాలేదు. ఈ మధ్య థియేటర్లు పున:ప‌్రారంభం అయినా ఆ సినిమా విడుదల సంగతి తేల్చట్లేదు.
దక్షిణాదిన కొత్త సినిమాలు 50 పర్సంట్ ఆక్యుపెన్సీతోనూ బాగానే నడుస్తున్నాయి. మంచి వసూళ్లు రాబడుతున్నాయి. బాలీవుడ్లో మాత్రం స్టార్లెవ్వరూ తమ చిత్రాల్ని విడుదల చేయడానికి ముందుకు రావట్లేదు. రోహిత్ శెట్టి-అక్షయ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం మామూలు రోజుల్లో రూ.200 కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు రాబడుతుందని అంచనా. అలాంటి సినిమాను 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో రిలీజ్ చేయడం ఇష్టం లేదేమో.
ఐతే ఈ సినిమా ఫలానా టైంలో రిలీజవుతుందనే సమాచారం కూడా అక్షయ్ అండ్ కో ఇవ్వట్లేదు. దాని సంగతి పూర్తిగా పక్కన పెట్టేసి కరోనా బ్రేక్ తర్వాత పూర్తి చేసిన బెల్ బాటమ్, ఇటీవలే మొదలుపెట్టిన బచ్చన్ పాండే సినిమాల రిలీజ్ డేట్లు మాత్రం ప్రకటించాడు. బెల్ బాటమ్ ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదల కానున్నట్లు ముందు ప్రకటించగా.. తాజాగా బచ్చన్ పాండే రిలీజ్ డేట్ ఇచ్చారు. అది వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకొస్తుందట. ఐతే అభిమానులు మాత్రం సూర్యవంశీ సంగతేంటో తేల్చమని అక్షయ్ మీద ఒత్తిడి తెస్తున్నారు.
This post was last modified on January 24, 2021 10:28 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…