Movie News

ఛాలెంజ్.. ఎంతటి బోల్డ్ రోలైనా ఆమె రెఢీ

ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఎదిగి, ఆ తర్వాత అవకాశాలు కోల్పోయి పెళ్లిచేసుకుని సెటిల్ అయ్యింది హీరోయిన్ భూమిక చావ్లా. పెళ్లైన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ ఇచ్చి ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్, కన్నడ, మలయాళ, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది భూమిక.

అయితే ఛాలెంజింగ్ రోల్ దొరికితే, ఎలాంటి బోల్డ్‌ సీన్స్‌లో నటించడానికైనా సై అంటోంది ఈ 41 ఏళ్ల హీరోయిన్. మారిన ప్రపంచంతో పాటు మనమూ మారాలంటున్న భూమిక… సీనియర్ హీరోయిన్ టబులా బోల్డ్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి రెఢీ అంటోంది.

పవన్ కళ్యాణ్‌కు ‘ఖుషీ’, మహేష్‌బాబుకు ‘ఒక్కడు’, ఎన్టీఆర్‌‌కు ‘సింహాద్రి’…ఇలా ఈ ముగ్గురు స్టార్లకు కెరీర్‌లో మొట్టమొదటి బ్లాక్‌బస్టర్ అందించిన హీరోయిన్ భూమిక. అయితే అంతటి లక్కీ హీరోయిన్, ఆ తర్వాత సినిమాల సెలక్షన్‌లో వేసిన తప్పటడుగు కారణంగా అవకాశాలు కోల్పోయి, స్టార్‌డమ్ చేజార్చుకుంది.

పెళ్లి చేసుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ ఇచ్చిన భూమిక… నాని ‘ఎమ్.సీ.ఏ’, నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాల్లో వదిన, అక్క పాత్రల్లో మెప్పించింది. బాలకృష్ణ ‘రూలర్’, సమంత ‘యూటర్న్’ మూవీస్‌లో కనిపించిన భూమిక… రోటీన్ పాత్రలు కాకుండా ‘అంధాదున్’లో టబులాంటి బోల్డ్ క్యారెక్టర్స్ కోరుకుంటోందట.

అయితే మొదటి నుంచి భూమికను పద్ధతైన పాత్రల్లోనే చూసిన తెలుగు ప్రేక్షకులు ఆమెను బోల్డ్ అండ్ సెక్సీ సీన్స్‌లో యాక్సెప్ట్ చేస్తారా? అనేది అనుమానమే. ఇదిలావుంటే ‘అంధాదున్’ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో టబు పాత్రను అనసూయ పోషిస్తోందనే టాక్ కొన్నాళ్ళు వినబడింది. తరువాత ఆ రోల్ కోసం టబు వచ్చిందన్నారు, రమ్యకృష్ణ దిగిందని చెప్పారు. వీళ్లందరికంటే భూమిక లాంటి సీనియర్ హీరోయిన్ అయితే ఇంపాక్ట్ బాగానే ఉంటుంది కాని, ఆ ఆఫర్ ఈమెకు వస్తుందంటారా?

This post was last modified on May 6, 2020 1:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

19 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago