నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఐదారేళ్లుగా చర్చ నడుస్తోంది. 2016-17 టైంలో అయితే అతడి అరంగేట్రానికి అంతా సిద్ధమైందని.. ఇక ప్రకటనే తరువాయి అని కూడా అన్నారు. బాలయ్య సైతం 2017లో తన కొడుకు అరంగేట్రం ఖాయం అని ప్రకటించాడు కూడా. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఆ ఊసే లేకపోయింది. మోక్షజ్ఞ ఇప్పటిదాకా సినిమాల వైపు చూడలేదు.
మధ్యలో ఒకట్రెండుసార్లు అతడి లుక్ చూస్తే ఇతను హీరో ఏంటి అనిపించింది. పూర్తిగా అదుపు తప్పిన ఫిజిక్‌తో ఉన్న నందమూరి కుర్రాడు.. తనకు సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేనట్లే కనిపించాడు. దీంతో ఈ మధ్య అతడి తెరంగేట్రం గురించి అభిమానులు మాట్లాడ్డం కూడా మానేశారు. ఆ చర్చ పూర్తిగా పక్కకు వెళ్లిపోయిన ఈ తరుణంలో మళ్లీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గుసగుసలు వినిపిస్తుండటం విశేషం.
గత ఏడాది బాలయ్య పుట్టిన రోజు తర్వాత మోక్షజ్ఞ ఎక్కడా కనిపించింది లేదు. ఐతే ఆ తర్వాత అతను తన ఫిజిక్ మీద దృష్టిపెట్టాడని.. కసరత్తులు చేస్తున్నాడని.. ఈ ఏడాది అతడి అరంగేట్ర సినిమా గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు. బాలయ్యతో ‘పైసా వసూల్’ సినిమాను రూపొందించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నాడని అంటున్నారు.
మోక్షు కోసం ఒక పవర్ ఫుల్ కథను రెడీ చేశాడని.. బాలయ్య కూడా దానికి ఆమోద ముద్ర వేశాడని ఒక ప్రచారం మొదలైంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ ప్రచారం అయితే ఆసక్తికరంగానే అనిపిస్తోంది కానీ.. నిజంగా ఇది జరుగుతుందా అని నందమూరి అభిమానుల్లోనే సందేహాలున్నాయి. మరి ఈ ప్రచారంపై నందమూరి కుటుంబ వర్గాలు ఏమంటాయో చూడాలి.
This post was last modified on January 23, 2021 2:40 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…