Movie News

కేజీఎఫ్-2 తెలుగు హక్కులకు అంత రేటా?


రెండేళ్ల కిందట ‘కేజీఎఫ్’ అనే సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుంటే.. కన్నడ సినిమాలు ఇక్కడేం వర్కవుట్ అవుతాయి అన్న వాళ్లే ఎక్కువ. ఎందుకంటే అప్పటిదాకా ఉపేంద్ర సినిమాలు కొన్ని తప్ప ఇక్కడ కన్నడ చిత్రాలు పెద్దగా ఆడింది లేదు. ‘కేజీఎఫ్’ ట్రైలర్లో స్టన్నింగ్స్ విజువల్స్ కారణంగా సినిమాపై కొంత ఆసక్తి కనిపించింది కానీ.. బాక్సాఫీస్ దగ్గర అది ఏమాత్రం ప్రభావం చూపుతుందన్న సందేహాలు కనిపించాయి. కానీ ఆ చిత్రం ఇక్కడ అద్భుతాలు చేసింది.

2018 క్రిస్మస్‌కు వచ్చిన వేరే తెలుగు సినిమాలను దెబ్బ కొట్టి మరీ అది బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి జాక్ పాట్ కొట్టారు. రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే రూ.12 కోట్లకు పైగా లాభాలు అందుకున్నారు. ఐతే ఇప్పుడు ‘కేజీఎఫ్’ చాప్టర్-2కు ఉన్న క్రేజ్ చూస్తే తొలి భాగం కంటే ఐదారు రెట్లు ఎక్కువగా వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్-2’ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఐతే పెద్దగా అంచనాల్లేని సమయంలో చాప్టర్-1ను చక్కగా ప్రమోట్ చేసి మంచి థియేటర్లు కేటాయించి పెద్ద ఎత్తున రిలీజ్ చేసిన సాయి కొర్రపాటి మీద నమ్మకంతో చాప్టర్-2ను కూడా ఆయనకే ఇస్తోందట హోంబలె ఫిలిమ్స్. ఐతే హక్కుల కోసం ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సాయికి కూడా భారీ రేటునే కోట్ చేశారట. టీజర్ రాకముందు వరకు కేజీఎఫ్-2 తెలుగు రైట్స్ డీల్ రూ.50 కోట్లకు తెగొచ్చని అనుకున్నారు కానీ.. టీజర్‌ రిలీజయ్యాక అంచనాలు ఇంకా పెరిగిపోవడంతో రేటు రూ.60 కోట్లకు పెరిగినట్లు సమాచారం.

కేజీఎఫ్-2కు పాన్ ఇండియా లెవెల్లో బంపర్ క్రేజ్ ఉంది. దానికి పోటీగా ఏ భాషలోనూ వేరే చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి వేసవిలో, థియేటర్లలో 100 పర్సంట్ ఆక్యుపెన్సీ ఉన్న టైంలో రిలీజ్ చేస్తే ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం. తెలుగులో రూ.60 కోట్ల షేర్ సాధించడం కష్టమేమీ కాకపోవచ్చు.

This post was last modified on January 23, 2021 10:24 am

Share
Show comments
Published by
satya

Recent Posts

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

29 mins ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

4 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

4 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

4 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

5 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

5 hours ago