Movie News

శంకర్ చేసిన తప్పేంటో తెలిసిపోయింది

మెగా ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోలేని డిజాస్టర్ గేమ్ ఛేంజర్. మూడేళ్ళ రామ్ చరణ్ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసిన ఆ మాస్టర్ పీస్ గురించి వీలైనంత వరకు గుర్తు చేసుకోకుండా ఉంటారు. నిర్మాత దిల్ రాజు సైతం అసలిది నేను తీయనే లేదనే తరహాలో ఎక్కడా ప్రస్తావన తీసుకురారు. అంత గొప్పగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అందరి వేళ్ళు ముందు నుంచి దర్శకుడు శంకర్ వైపు ఉన్న సంగతి తెలిసిందే. ఇంత గ్యాప్ తర్వాత మరోసారి ఇది టాపిక్ అయ్యింది.

గేమ్ ఛేంజర్ కు కథను ఇచ్చింది కార్తీక్ సుబ్బరాజ్. కల్ట్ డైరెక్టర్ గా పేరున్న ఇతను ఇలాంటి స్టోరీ ఇవ్వడం ఏమిటని అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. తాజాగా జరిగిన ఫిలిం మేకర్స్ మీట్ లో ఒక విద్యార్ధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా దీని గురించి మరింత క్లారిటీ ఇచ్చారు సుబ్బరాజ్. మహాన్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు శంకర్ కు కథను ఇచ్చానని, అయితే పనుల ఒత్తిడి వల్ల దాని మీద పూర్తిగా వర్క్ చేయలేదని, రామ్ చరణ్ ఇమేజ్, బడ్జెట్ కు తగ్గట్టు కొన్ని మార్పులు వాళ్ళే చేసుకున్నారని చెప్పారు.

కార్తీక్ సుబ్బరాజ్ వెర్షన్ ప్రకారం హీరో చేసిన డ్యూయల్ రోల్స్ లో ఒకతను ఐఏఎస్ ఆఫీసర్. దాన్ని ఎన్నికల అధికారిగా మార్చారు. రెండో క్యారెక్టర్ మధురైలో పుట్టి పెరిగిన గ్యాంగ్ స్టర్. అందులోనే స్నేహితుల వెన్నుపోటు, రాజకీయాలు ఉంటాయి. దాన్ని శంకర్ అప్పన్నగా మార్చి పల్లెటూరి నేపథ్యం పెట్టి ఏదేదో ప్రయోగం చేశారు. ఫస్ట్ హాఫ్ లోనూ కాలేజీ ఫ్లాష్ బ్యాక్. కియారా అద్వానీతో లవ్ అంటూ ఎటెటో తీసుకెళ్లిపోయారు. థియేటర్ జనాలకు విసుగు తెప్పించారు.

ఇదంతా ఇప్పుడు తవ్వుకుని లాభం లేదు కానీ రాబోయే రోజుల్లో ఒక కథని అవసరం లేని మార్పులు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. గేమ్ ఛేంజర్ వల్ల చరణ్ తన కెరీర్ లో చాలా విలువైన కాలాన్ని ఖర్చు పెట్టాడు. కానీ రిజల్ట్ దక్కలేదు. పెద్ది లాగా ఎబోవ్ యావరేజ్ అయినా బాధ ఉండేది కాదు కానీ ఆలా జరగకపోవడం ఫ్యాన్స్ కి కలతని మిగిల్చింది. సుకుమార్ డైరెక్షన్లో ఆర్సి 17 నవంబర్ 1 నుంచి ప్రారంభం కాబోతోందని ఫ్రెష్ అప్డేట్.

This post was last modified on October 28, 2026 5:24 pm

Share

Recent Posts

ఉప్పాడను కుదిపేసిన అర్నబ్ తుఫాను

అర్నబ్ తుఫాను ధాటికి తీర ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో…

2 hours ago

రామ్‌చరణ్ చేజారిందే రన్బీర్ అందుకున్నాడా

వచ్చే నెల నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. నిర్మాత…

3 hours ago

47 ఏళ్ళ తర్వాత… చిరు కమల్ కలయిక ?

సినీ ప్రియులు చూడాలని బలంగా కోరుకునే కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటిదాకా…

5 hours ago

ఏడు పాటలు ఎందుకు దాచి పెట్టారు

నిన్న జరిగిన ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ ఒక షాక్ ఇచ్చాడు. ఆల్బమ్ లో మొత్తం…

5 hours ago

రామాయణ ప్రీమియర్ టాక్ ఏమంటున్నారు

ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మొదటి వరల్డ్ ప్రీమియర్ భారత కాలమాన ప్రకారం ఇవాళ…

6 hours ago

నవంబర్ నెలలో ఇంత రష్ ఏంటయ్యా

మాములుగా బాక్సాఫీస్ లెక్కల్లో నవంబర్ నెలని డ్రైగా భావిస్తారు. కారణం భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీపావళి…

6 hours ago