Political News

ఉప్పాడను కుదిపేసిన అర్నబ్ తుఫాను

అర్నబ్ తుఫాను ధాటికి తీర ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతం అర్నబ్ దెబ్బకు అతలాకుతలమైంది. రాకాసి అలల ధాటికి ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు కొట్టుకుపోయింది. ఈ ప్రాంతంలో సుమారు 30కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. బలమైన గాలులధాటికి మరికొన్ని ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. 150 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెను గాలుల ధాటికి పలు చోట్ల చెట్లు కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది.

అలల ఉద్ధృతికి సముద్ర రక్షణ గోడపై ఉన్న భారీ బండరాళ్లు రోడ్డుపైకి కొట్టుకురావచ్చి రాకపోకలు స్తంభించాయి. తీరప్రాంత గ్రామాల్లో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
సుబ్బంపేట వద్ద తీరప్రాంతాన్ని కాపాడేందుకు నిర్మించిన రక్షణ గోడ సైతం పూర్తిగా ధ్వంసమైంది. రక్షణ కోసం ఏర్పాటు చేసిన భారీ బండరాళ్లు కూడా అలల తాకిడికి చెల్లాచెదురయ్యాయి. దీంతో, రాకపోకలు స్తంభించాయి.

ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు అనేక చోట్ల కోతకు గురైంది. సుబ్బంపేట దగ్గర రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో బీచ్ రోడ్డుపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉందని, కాబట్టి ప్రజలు తీరప్రాంతాలకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే బీచ్ రోడ్డుపై ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు.

కాగా, అర్నబ్ తుపాను బాపట్ల, విశాఖపట్నంల మధ్య యానాంకు దక్షిణంగా తీరం దాటింది. అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంటకు తుఫాను తీరం దాటింది. దీంతో, తీర ప్రాంతాల్లో 130-150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలోనే తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రేపు కూడా సెలవు కొనసాగించే అవకాశముంది. తుఫాన్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తేదీలు కూడా మారే అవకాశముంది.

This post was last modified on October 28, 2026 3:11 pm

Share

Recent Posts

రామ్‌చరణ్ చేజారిందే రన్బీర్ అందుకున్నాడా

వచ్చే నెల నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. నిర్మాత…

56 minutes ago

47 ఏళ్ళ తర్వాత… చిరు కమల్ కలయిక ?

సినీ ప్రియులు చూడాలని బలంగా కోరుకునే కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటిదాకా…

3 hours ago

ఏడు పాటలు ఎందుకు దాచి పెట్టారు

నిన్న జరిగిన ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ ఒక షాక్ ఇచ్చాడు. ఆల్బమ్ లో మొత్తం…

3 hours ago

రామాయణ ప్రీమియర్ టాక్ ఏమంటున్నారు

ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మొదటి వరల్డ్ ప్రీమియర్ భారత కాలమాన ప్రకారం ఇవాళ…

3 hours ago

నవంబర్ నెలలో ఇంత రష్ ఏంటయ్యా

మాములుగా బాక్సాఫీస్ లెక్కల్లో నవంబర్ నెలని డ్రైగా భావిస్తారు. కారణం భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీపావళి…

4 hours ago

స్థానికం `హోరాహోరీ`.. స‌ర్వేల లెక్క‌లివే… !

ఏపీలో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు ఎలా ఉంటుంది? అనేది ఆస‌క్తిగా మారింది.…

5 hours ago