మాములుగా బాక్సాఫీస్ లెక్కల్లో నవంబర్ నెలని డ్రైగా భావిస్తారు. కారణం భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీపావళి పండగ ఉన్నప్పటికీ సెలవు ఒక్క రోజు మాత్రమే వస్తుంది కాబట్టి హాలిడే అడ్వాంటేజ్ ఉండదు. అందులోనూ ఈసారి దివాలి ఆదివారం వచ్చి ఇంకో ట్విస్టు ఇచ్చింది. అయితే 12, 13 తేదీల్లో ఏకంగా డజను కొత్త రిలీజులు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో ఒకవైపు సంతోషం కలిగిస్తూనే ఇంకో వైపు ఆందోళన రేపుతోంది. ముందు ఏమేం ఉన్నాయో చూద్దాం.
మొదటిసారి శర్వానంద్ ఊరమాస్ పాత్ర చేసిన ‘భోగి’ మీద క్రమంగా హైప్ వస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ రూరల్ డ్రామాలో యాక్షన్ ఎపిసోడ్స్ షాక్ కి గురి చేస్తాయని అంటున్నారు. లిటిల్ హార్ట్స్ తో మార్కెట్ సంపాదించుకున్న మౌళి హీరోగా రూపొందిన ‘దొంగ నా కొడుకు’ మీద యూత్ లో మంచి అంచనాలే ఉన్నాయి. పెద్ద చేతులు అండగా నిలబడి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ‘ఇట్లు అర్జున’ ఎట్టకేలకు మోక్షం దక్కించుకోనుంది.
35 చిన్న కథ కాదు ఫేమ్ విశ్వదేవ్ నటించిన ‘డార్క్ చాకొలేట్’ చాలా గ్యాప్ తర్వాత థియేటర్ మోక్షం దక్కించుకుంటోంది. దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. యాంకర్ సుధీర్ ‘గోట్’ ని తక్కువంచనా వేయడానికి లేదు. ఇవి కాకుండా టాల్కమ్ పౌడర్, చంద్రయాన్, రోమియో జూలియట్, మాయా లేడీ ఇలా మరికొన్ని చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు ఒకేసారి ముప్పేట దాడి చేయబోతున్నాయి. వీటితో పాటు నాగార్జున గీతాంజలి రీ రిలీజ్ కూడా ఉంది.
ఇలా అతివృష్టి లాగా ఇన్నేసి సినిమాలు రావడం ఎంతమేరకు సేఫ్ గేమ్ అవుతుందనేది టాక్ ని బట్టి ఉంటుంది. కొన్ని సెంటర్లలో స్క్రీన్ల లభ్యత తక్కువ కారణంగా పైన చెప్పినవాటిలో కొన్ని రిలీజ్ కూడా కావు. పైగా ఆదర్శ కుటుంబం మూడో వారం, రామాయణ పార్ట్ 1 రెండో వారంలో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి థియేటర్ల లభ్యత అంత ఈజీగా ఉండదు. మరి ఇన్నేసి గంపగుత్తగా రావడం బాగానే ఉంది కానీ వీటిలో ఏవి నిలబడతాయో ఏవి మాయమవుతాయో వేచి చూడాలి.
This post was last modified on October 28, 2026 11:32 am
ప్రియాంక గాంధీ తన ఇంట్లో గత 22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళకు ఒక మధురమైన అనుభూతిని అందించారు. తమిళనాడు సీఎం…
కార్లలో ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడటంలో ఎయిర్‌బ్యాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అదే టెక్నాలజీని ఇప్పుడు హెల్మెట్‌లోనూ ఉపయోగించే ఆలోచన…
ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే చాలు.. చెన్నైతో సంబంధం లేని జట్ల అభిమానులు కూడా అతడి కోసం ఎదురుచూసేవారు. ఒక్కోసారి సొంత…
డామిట్... కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా తయారైంది బీజేపీ పరిస్థితి. వివాదాస్పద " ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ…
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇక…
మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాలపై సీఈవో సత్య నాదెళ్ల కూడా హామీ ఇవ్వలేకపోతున్నారు. భారత్ సహా నాలుగు దేశాల్లో ఉద్యోగులకు కంపెనీ…