ఏపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య పోరు ఎలా ఉంటుంది? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు కూటమి ప్రయత్నించింది. అయితే.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. వైసీపీ మొండిగానే రంగంలోకి దిగింది. దీంతో పోటీ అనివార్యం.. ఎన్నికల పోలింగ్ కూడా అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఏయే పార్టీలకు అనుకూలమైన వాతావరణం ఉంది? ఏయే పార్టీల మధ్య పోరు ఉంది? అనే విషయాలపై సర్వేలు సాగుతున్నాయి. తాజాగా పలు సంస్థలు ఈ రిపోర్టులను కూడా వెలువరిం చాయి.
సీ-ప్యాక్ ఒపీనియన్ పోల్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 84 స్థానాలు, ప్రతిపక్ష వైసీపీకి 16 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే.. పోలింగ్ మాత్రం అన్ని పార్టీలకు కీలకంగా మారుతుందని అంచనా వేయడం గమనార్హం. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల శాతాన్ని అంచనా వేస్తూ.. టీడీపీకి 46.9%, వైసీపీకి 35%, జనసేనకు 9%, బీజేపీకి 3.5% ఓట్ల షేర్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇది స్థానిక ఎన్నికల్లో ప్రతిబింబించనుందని తెలిపింది.
మూడ్ ఆఫ్ ఆంధ్రా సర్వే ప్రకారం.. వైసీపీకి 45.5%, కూటమికి 44.5% ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీనిని బట్టి స్థానిక ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న సంకేతాలు ఇచ్చింది. ఇదిలా వుంటే.. మరోవైపు టీడీపీ సొంతంగా ఐవీఆర్ ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తమ అభ్యర్థుల గెలుపుపై అంచనా వేస్తోంది. ప్రతి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఫోన్లు చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటు న్నారు. ఆయా వార్డుల్లోను, మేయర్ స్థానాల్లో పోటీలో ఉన్న వారి పేర్లు చెప్పి.. ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నా రు.
ఉదాహరణకు, విజయవాడ.. కుప్పం, చిత్తూరు లాంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల రేసులో ఉన్న ఆశావహుల బలాబలాలను అంచనా వేసేందుకు ఆటోమేటెడ్ ఫోన్ కాల్స్ (ఐవీఆర్ ఎస్) ద్వారా విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. దీని ప్రకారం.. తమ అభ్యర్థులు గెలుస్తారని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ విషయానికి వస్తే.. ఇలాంటి ఫోన్ కాల్స్ లేకపోయినా.. నేరుగా ప్రజలను కలుసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా.. స్థానిక సమరం హోరా హోరీ తప్పదన్న సంకేతాలు అయితే వస్తున్నాయి.
This post was last modified on October 28, 2026 10:39 am
వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.…
రాజకీయం అంటే ఇంతే!.. ఊహించని పరిణామాలు జరగడమే అసలైన రాజకీయం. ఎట్టి పరిస్థితిలోనూ ఎక్కడా ఏకగ్రీవాలు కారాదని.. ఎక్కడా పోటీ…
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోవడం తమిళనాడులో సంచలనం సృష్టిస్తుంది. ఒకేసారి…
ముందే హెచ్చరిక ఉన్నప్పటికీ ప్రకృతిని పూర్తిగా ఎదురుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ కేంద్రంగా ముంచేస్తున్న అర్నబ్…
తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన ధనుష్.. ప్రయోగాల నుంచి కొంచెం పక్కకు వచ్చి ఈసారి పక్కా కమర్షియల్ సినిమానే చేస్తున్నట్లున్నాడు.…
ప్రస్తుతం విశాఖపట్నానికి చేరువగా ఉన్న అర్నబ్ తుఫాన్ ప్రభావం ఏపీలోని తీర ప్రాంత జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికలు వస్తున్నాయి.…