Movie News

రామాయణకు ఇప్పుడున్న ఊపు సరిపోతుందా

ఇండియన్ హిస్టరిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రచారం జరుపుకున్న రామాయణ పార్ట్ 1 ఇంకో పది రోజుల్లో విడుదల కానుంది. చాలా ముందుగా అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టడం ఒక విశేషం కాగా తెలుగు వెర్షన్ కు సైతం దాన్ని వర్తింపజేయడం ఇంకో ట్విస్టు. టికెట్ రేట్ల పెంపుకు వెళ్లకుండా ఏపీ తెలంగాణ హక్కులు తీసుకున్న దిల్ రాజు సరైన నిర్ణయం తీసుకోవడం ఓపెనింగ్స్ కు చాలా దోహదం చేయనుంది. ముఖ్యంగా కౌంటర్ సేల్స్ పెద్ద ఎత్తున ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.

సరే ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ రామాయణకు ఇప్పుడు ఎంత ఊపు ఉందనేది శాతంలో కనక కొలిస్తే ఒక యాభై శాతం అని చెప్పొచ్చు. ఎందుకంటే కంటెంట్ పరంగా దీని మీద ఎగ్జైట్ మెంట్ తక్కువ. అందరికీ తెలిసిన కథ, వందల వేలసార్లు తెరమీద వీక్షించిన గాథ కాబట్టి ఎగబడి చూడాలన్న కోరిక వెంటనే పుట్టదు. అయితే అన్ని వేలకోట్లతో తీశారు కనక ఆ గ్రాండియర్ లుక్ తో పాటు క్రేజీ క్యాస్టింగ్ ఉండటం వల్ల సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. దాని మోతాదు ఇంకా పెరగాలి.

టీమ్ ప్రస్తుతం పబ్లిసిటీ పరంగా ఏమేం చేయాలనే దాని గురించి పక్కా ప్రణాళికతో ఉంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ఆల్రెడీ ముంబైతో పాటు దక్షిణాది నగరాలు ఆల్రెడీ ఒక రౌండ్ వేసేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయిపోయాయి. ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇకపై ఇంకేదైనా వినూత్నంగా ఆలోచించాలి. ముఖ్యంగా అవుట్ డోర్ ప్రచారం మీద నిర్మాత నమిత్ మల్హోత్రా ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిసింది. కామన్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇదే మంచి ఆయుధం.

రామాయణ పార్ట్ 1 తర్వాత సీక్వెల్ కు రెండు సంవత్సరాల గ్యాప్ రావొచ్చని ముంబై వర్గాల కథనం. ఇప్పటి ఫలితం ఎలా ఉన్నా రెండో భాగం మీద ఎక్కువ ఫోకస్ పెడతారట. చాలా కీలకమైన ఎపిసోడ్లు, రామ రావణ యుద్ధం, లంకా దహనం, సంజీవిని పర్వతం, రామసేతువు లాంటి ఘట్టాలన్నీ అందులోనే ఉండబోతున్నాయి. అలాని పార్ట్ 1 లో తక్కువని కాదు కానీ రెండు వేర్వేరు ప్రపంచాలు తిరిగిన ఫీలింగ్ అయితే కలిగిస్తారట. అన్నట్టు ఈ మధ్య పోస్టర్లలో యష్ నే ఎక్కువ హైలైట్ చేస్తుండటం గమనార్హం.

This post was last modified on October 24, 2026 11:34 pm

Share

Recent Posts

దెయ్యం సినిమాతో బ్రేక్ అందుకున్న దేవిక

ఇటీవలే విడుదలైన హారర్ మూవీ 418 బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. టాక్ మరీ యునానిమస్ గా రాకపోయినా…

6 hours ago

పునేఠా పార‌ద‌ర్శ‌క‌త‌కు ఇదే నిద‌ర్శ‌నం జ‌గ‌న్‌

ఏపీలో జ‌రుగుతున్న స్థానిక‌, మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర…

7 hours ago

శ్రీకాంత్‌ను ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరు

ప్యారడైజ్ థియేటర్ రన్ అయిపోయి రోజులు గడిచిపోయాయి. నైజామ్ మినహాయించి మిగిలిన చోట్ల డిజాస్టర్ కావడం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇది…

8 hours ago

వంగవీటి రాధా స్పీడ్ పెంచాలి

విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ అభ్య‌ర్థులుగా ముగ్గురు పోటీ ప‌డుతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో కీల‌కంగా భావించే ఈ స్థానం..…

8 hours ago

మాట నిలబెట్టుకుంటే అదే పెద్ద కానుక

నిన్న విడుదలైన ఫౌజీ ఇంట్రో టీజర్ మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. లాజిక్స్ ప్రశ్నిస్తూ…

8 hours ago

సూపర్ హిట్ రణబాలి అని పిలవండి

విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా ర‌ణ‌బాలికి ఆరంభంలో ఎంత నెగెటివ్ టాక్ వ‌చ్చిందో తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వ‌ర‌కు…

9 hours ago