Political News

కేసీఆర్ కరోనా తెచ్చారని ఒప్పుకుంటారా?

తెలంగాణలో క‌రువు త‌ప్ప‌దా? వ‌చ్చే 10 నెల‌ల పాటు రాష్ట్రంలో నీటి కొర‌త కొన‌సాగుతుందా? ఫ‌లితంగా వ్య‌వ‌సాయం నుంచి తాగు నీటి వ‌ర‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌వా అంటే.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వ‌యంగా చెప్పిన మాట ప్ర‌కారం.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా నెల‌కొన్న ఎల్‌నినో ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్రంలో తీవ్రమైన ప‌రిస్థితి నెల‌కొంది. వ‌ర్షాభావానికి తోడు విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేప‌థ్యంలో నీటికి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఇదే విష‌యాన్ని గ‌త కొన్నాళ్లుగా ముఖ్య‌మంత్రి చూచాయ‌గా చెబుతున్నారు. అదే స‌మయంలో ఈ ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న బీఆర్ ఎస్‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో వ‌చ్చే 8-10 నెల‌ల పాటు తాగు, సాగునీటి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని సీఎం హెచ్చ‌రించారు. బొట్టు బొట్టు వ‌డిసి ప‌ట్టుకుంటే త‌ప్ప‌.. ఇబ్బందులు తీర‌వ‌ని తెలిపారు. అయితే.. మ‌హారాష్ట్ర ద్వారా నీటిని పొందేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితి రాజ‌కీయంగా స‌ర్కారుకు ఇబ్బందిగా మారింది. దీనిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చినా.. ఇవ్వ‌క‌పోయినా క‌రువు ఇచ్చింద‌ని.. క‌రువు తెచ్చింద‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీటిపైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

బీఆర్ ఎస్ హ‌యాంలో క‌రోనా వ‌చ్చింద‌ని.. వంద‌ల మంది మృత్యుపాల‌య్యార‌ని.. అప్ప‌ట్లో బీఆర్ఎస్ నాయ‌కులు క‌రోనాను తీసుకువ‌చ్చార‌ని అంగీక‌రిస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ఎల్ నినో కూడా క‌రోనా వంటిదేన‌ని.. అప్ప‌ట్లో క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ట్టుగానే.. ప్ర‌స్తుతం ఎల్‌నినో కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉంద‌న్నారు. నీటి స‌మృద్ధిలో ముందున్న రాష్ట్రాలు కూడా ప్ర‌స్తుతం 20 శాతం మేర‌కు త‌గ్గించి వాడుకోవాల‌ని కోరుతున్నాయ‌ని గుర్తు చేశాయి. రాష్ట్రంలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే ఎల్‌నినో ఎద్ద‌డిని ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ దుష్ప్ర‌చారాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు ముందుకు రావాల‌న్నారు.

ఇది నిజం!

రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ఎల్‌నినో ప‌రిస్థితి మ‌రో 10 నెల‌ల పాటు ఉంటుంద‌ని సీఎం చెప్పారు. ఒక‌వైపు నీరు కావాలి.. మ‌రోవైపు విద్యుత్ కూడా అంతే ముఖ్యం. దీనికి అన్ని ప్ర‌త్యామ్నాయాలు చూస్తున్నాం. కానీ.. ఎల్‌నినో కార‌ణంగా ఇబ్బందులు వ‌స్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ప్ర‌స్తుతం తాగ‌డానికి కూడా నీళ్లు ల‌భించ‌క ఇబ్బందులు ప‌డుతున్నాం. అయిన‌ప్ప‌టికీ.. తాగేందుకు అవ‌స‌ర‌మైన నీటిని స‌కాలంలో అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. అని సీఎం వివ‌రించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో రాజ‌కీయాలు చేయ‌కుండా అంద‌రూ స‌హ‌క‌రిస్తే.. రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌ని రేవంత్ రెడ్డి సూచించారు.

This post was last modified on October 25, 2026 4:57 pm

Share

Recent Posts

ఇంత ‘కల్ట్’ ఫాలోయింగ్ ఊహించలేదేమో

ఒకప్పుడు హీరోలకు షూటింగ్ లేని టైంలో వాళ్ళను కలుసుకునేందుకు అభిమానులు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్ళేవాళ్ళు. స్టార్లు కూడా విసుక్కోకుండా…

46 minutes ago

హిట్ట‌యితే వంద‌లు… ఫ్లాప్ అయితే ఒక‌ట్లు

ప‌దేళ్ల కింద‌ట ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండియా అంత‌టా విప‌రీత‌మైన పాపులారిటీ సంపాదించాడు మ‌ల‌యాళ న‌టుడు నివిన్ పౌలీ. ఆ…

3 hours ago

నేత‌ల వైఖ‌రితో చంద్ర‌బాబు.. జ‌గ‌న్ వైఖ‌రితో నేత‌లు..

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అంతా బాగుంద‌న్న ఫీలింగ్ ఆయా పార్టీల్లో పైకే క‌నిపిస్తోంది. అంత‌ర్గ‌తంగా చూస్తే..…

5 hours ago

బిల్డప్ ఇచ్చిన సినిమాకు టాక్ ఏంటి

ఫ్యామిలీ మ్యాన్ పుణ్యమాని ఓటిటి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకరిగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ కొత్త…

7 hours ago

తెలంగాణ బీజేపీకి కరెక్ట్ ఇంచార్జి దొరికినట్టేనా?

తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సునీల్ బన్సల్ .. తొలి ప‌ర్య‌ట‌న‌లోనే నేత‌ల‌ను లైన్‌లో పెట్టే చ‌ర్య‌ల దిశ‌గా…

8 hours ago

రామాయణకు ఇప్పుడున్న ఊపు సరిపోతుందా

ఇండియన్ హిస్టరిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రచారం జరుపుకున్న రామాయణ పార్ట్ 1 ఇంకో పది రోజుల్లో విడుదల…

13 hours ago