‘పెళ్ళిచూపులు’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన తరుణ్ భాస్కర్.. తర్వాత దశాబ్ద కాలంలో దర్శకుడిగా రూపొందించింది రెండే సినిమాలు. కానీ నటుడిగా మాత్రం డబుల్ డిజిట్ సినిమాలు చేశాడతను. ‘ఫలక్‌నుమా దాస్’లో తరుణ్ చేసిన పోలీస్ పాత్ర బాగా క్లిక్ అవడంతో తనకు నటుడిగా అవకాశాలు వరుస కట్టాయి.
తరుణ్హీ రోగా కూడా ఓం శాంతి శాంతి శాంతి:, గాయపడ్డ సింహం లాంటి చిత్రాలు చేశాడు. ఐతే నటుడిగా ఇప్పుడు ఇంత బిజీగా ఉన్న అతను.. తొలి అవకాశం ఇచ్చినపుడు మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదట. ఏకంగా మూడు నెలల పాటు వెంట పడి అతి కష్టం మీద అతణ్ని ఒప్పించాడట విశ్వక్. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు విశ్వక్.
‘‘ఫలక్‌నుమా దాస్‌లో ఎస్ఐ పాత్ర చేయమంటే తరుణ్ ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు అడిగినా.. నటన తనకు సూటవ్వదనే చెప్పాడు. తనకు ఇంట్రెస్ట్ లేదనే చెప్పాడు. మూడు నెలల పాటు తన వెంట తిరిగా. చివరికి ఒక రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఏదో ఫొటో షూట్ జరుగుతుంటే వెళ్లా. అక్కడికి వెళ్లి తరుణ్‌కు బిస్కెట్ ఇచ్చా. ఏంటిది అని అడిగితే.. నువ్వు నాకు బిస్కెట్ ఇచ్చావు కదా, అందుకే నేనూ ఇస్తున్నా అన్నాను.
తర్వాత తరుణ్ కొంచెం ఆలోచించి సరే చేస్తాలే పో అన్నాడు. అప్పుడు ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశాడు. కానీ ఇప్పుడు యాక్టింగ్ ఆపమన్నా ఆపట్లేదు. తరుణ్ తన దగ్గరికి వచ్చే ఎవరినీ అగౌరవపరచడు. తాను ఆపలేని స్థాయిలో ఆఫర్లు వస్తున్నట్లున్నాయి. అందుకే చేస్తున్నాడు. తరుణ్ దగ్గరికి వెళ్లి ఎవరైనా కొంచెం దీనంగా ఫేస్ పెట్టి తమ కష్టాలు చెప్పుకుంటే చాలు.. సినిమా చేసేస్తాడు. అందరూ తన దగ్గర ఆ స్విచ్‌యే ఆన్ చేస్తున్నట్లున్నారు’’ అని తరుణ్ భాస్కర్ చమత్కరించాడు.
This post was last modified on October 23, 2026 4:51 pm
ఇడుపు కాయితం.. ఈ పేరుతో సినిమా అనౌన్స్ చేసినపుడు సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఇప్పుడీ సినిమా…
స్టార్ హీరోల పుట్టినరోజులు హఠాత్తుగా డిసైడ్ కావు. ప్రతి సంవత్సరం అదే రోజు రిపీట్ గా వస్తుంది. వాళ్ళ వయసులు…
మూవీ లవర్స్ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కలయిక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో వెంకటేష్ సినిమా. అది ఆదర్శ కుటుంబం…
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయినా.. తన ప్రతి సినిమా స్కేల్, కాన్వాస్, బడ్జెట్లు చాలా పెద్దవే అయినా…
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను తన రాజకీయ వారసురాలిగా…
నిర్మాత బన్నీ వాస్ ఇవాళ జరిగిన ఇడుపు కాగితం సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఏఐ గురించి మాట్లాడుతూ రాబోయే…