తెలుగులో విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఇప్పుడందరూ కొత్తదనం కొత్తదనం అంటున్నారు కానీ.. తెలుగు సినిమా ఒక మూసలో నడుస్తున్న సమయంలో ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు లాంటి విభిన్న సినిమాలతో అతను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ యేలేటి సినిమాల్లో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నవి తక్కువ. అందుకే అతడి కెరీర్ అనుకున్నంతగా జోరందుకోలేదు.
స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం, షూటింగ్ చేయడంలో యేలేటి కొంచెం నెమ్మది అన్న సంగతీ తెలిసిందే. అందుకే దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో అరడజను సినిమాలే చేశాడు. చివరగా 2016లో ‘మనమంతా’ సినిమాతో అతను ప్రేక్షకులను పలకరించాడు. మళ్లీ ఇప్పుడు నితిన్ హీరోగా ‘చెక్’ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది.
‘చెక్’ సినిమా షూటింగ్ అంతా కూడా పూర్తయిపోవడంతో విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. అన్ సీజన్ అయినప్పటికీ సినిమా మీద నమ్మకంతో ఫిబ్రవరి విడుదలకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖర్లో నితిన్ మరో సినిమా ‘రంగ్ దె’ విడుదల కానుంది. ఆ తర్వాత వేసవి అంతా ఊపిరి సలపని విధంగా షెడ్యూల్ ఉన్నాయి. పెద్ద సినిమాలు పెద్ద సంఖ్యలో విడుదల కానున్నాయి. అందుకే ముందుగా ఫిబ్రవరిలో ‘చెక్’ను రిలీజ్ చేసేయాలని ఫిక్సయ్యారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘భవ్య క్రియేషన్స్’ అధినేత ఆనంద్ ప్రసాద్. ఆయన గత ఏడాది ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో విజయాన్నందుకున్నారు.
‘చెక్’లో నితిన్ చెస్ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. చేయని నేరానికి అతడికి జీవిత ఖైదు పడితే చెస్‌ను ఆధారంగా చేసుకుని ఎలా తన సమస్యల నుంచి బయటపడ్డాడన్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో యేలేటి బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
This post was last modified on January 22, 2021 6:45 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…