Movie News

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇద్దరు యువ కథానాయకుల పెళ్లి గురించి వార్తలు బయటికి వచ్చాయి. అందులో ఒకరు సాయిధరమ్ తేజ్ కాగా.. ఇంకొకరు తేజ సజ్జ.

తేజు తన చిన్ననాటి స్నేహితురాలిని త్వరలో పెళ్లాడబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు తేజ సజ్జ వివాహం డిసెంబరులో జరగనున్నట్లు రూమర్లు వినిపించాయి. ఈ విషయంలో ఇప్పుడు తేజ సజ్జ ఓపెన్ అయ్యాడు. తన పెళ్లి వార్తను అతను ధ్రువీకరించాడు. నిశ్చితార్థం, పెళ్లి, వధువు, వేదికకు సంబంధించి అతను సమాచారాన్ని పంచుకున్నాడు.

డిసెంబరులో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తాను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు తేజ వెల్లడించాడు. నవంబరులో నిశ్చితార్థం జరుగుతుందన్నాడు. వధువు పేరేంటన్నది వెల్లడించలేదు కానీ.. తమది పెద్దలు కుదిర్చిన పెళ్లే అని.. వధువుకు సినీ పరిశ్రమతో సంబంధం లేదని అతను తెలిపాడు. తనకు కాబోయే భార్య కుటుంబం టెక్నాలజీ బిజినెస్‌లో ఉన్నట్లు తేజ చెప్పాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తామని తేజ తెలిపాడు.

చిన్నతనంలో ‘ఇంద్ర’ సహా అనేక పెద్ద సినిమాల్లో బాల నటుడిగా ఆకట్టుకున్నాడు తేజ. ఆ తర్వాత అతను ‘ఓ బేబీ’ చిత్రంలో ప్రత్యేక పాత్రతో రీఎంట్రీ ఇచ్చాడు. ఆపై ఇష్క్, జాంబిరెడ్డి చిత్రాల్లో హీరోగా నటించాడు. తేజకు ‘హనుమాన్’ పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆపై ‘మిరాయ్’ కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడు అతను ‘జాంబిరెడ్డి-2’తో పాటు ‘మిరాయ్-2’ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నాడు. ఇటీవలే అతను హోస్ట్‌గా ‘ట్రైటర్స్’ అనే షో కూడా అమేజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది.

This post was last modified on October 22, 2026 11:31 pm

Share

Recent Posts

వారికి కాస్త రెస్ట్ ఇవ్వండి ప్లీజ్..

ఉద్యోగుల పని పరిస్థితులు, వారి ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హోటళ్లు,…

7 hours ago

వారికి 66 శాతం రిజ‌ర్వేష‌న్‌

రాజకీయాల్లో యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తామ‌న్న మాట‌ను నిల‌బెట్టుకుంటామ‌ని ప‌రివ‌ర్త‌న రాజ‌నీతి పార్టీ(పీఆర్‌పీ) అధ్య‌క్షుడు వి. విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో…

7 hours ago

సోనియా గాంధీ బయోపిక్ ప్రకటించిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తున్న బిలాంగింగ్…

8 hours ago

పదేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేసిన ఇరుముడి హీరోయిన్!

ఇరుముడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన…

8 hours ago

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి.. గ్రీస్‌లో గ్రాండ్ వెడ్డింగ్!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో కుటుంబ…

8 hours ago

నాగ్ అప్పుడు బాధితుడు.. ఇప్పుడు చీఫ్ గెస్ట్!

రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం…

9 hours ago